అయ్యో ఏమైంది...? కేరళలో టీ స్టాల్ నడుపుతున్న సూపర్ స్టార్ రజనీకాంత్

అయ్యో ఏమైంది...?  కేరళలో టీ స్టాల్ నడుపుతున్న సూపర్ స్టార్ రజనీకాంత్

రజనీకాంత్..ఈ పేరే ఓ సెన్సేషన్. తలైవాగా..తమిళ ప్రజల హృదయాల్లో నిలిచాడు. సూపర్ స్టార్గా తెలుగు ప్రేక్షకుల మనసు దోచాడు. భిన్న పాత్రలు..విభిన్న డైలాగులతో తనకు తానే సాటి అని అనిపించుకున్నాడు. అయితే ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ ఏం చేస్తున్నాడు...అంటే ఆయన కేరళలో టీ స్టాల్ నడిపిస్తున్నాడు. అక్కడ టీ అమ్ముతున్నాడు. ఏంటీ రజనీకాంత్ టీ అమ్ముతున్నాడా..? అనుకుంటున్నారా..? అవును..టీ సేల్ చేస్తున్నాడు. వివరాల్లోకి వెళ్తే..

కేరళ రాష్ట్రం పోర్ట్ కొచ్చి పట్టాలం రోడ్ లో ఓ వ్యక్తి టీ స్టాల్ నడుపుతున్నాడు. అతను సూపర్ స్టార్ రజనీకాంత్ లాగే ఉన్నాడు. దీంతో అక్కడున్న వారంతా ఆయన్ను చూసి ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఇదేంటి రజనీకాంత్ టీ స్టాల్ నడుపుతున్నాడు అని అనుకున్నారు. ఆయనతో మాట్లాడిన తర్వాత అసలు విషయం తెలిసి..నవ్వుకున్నారు. నిజం ఏంటంటే..అతను సూపర్ స్టార్ రజనీకాంత్ కాదు..అచ్చం ఆయనలాగే ఉన్న సుధాకర ప్రభు. 63 ఏళ్ల సుధాకర ప్రభును చూస్తే రజనీకాంత్ ను చూసినట్లే అనిపిస్తుంది. ఆయన హెయిర్, ముఖం అచ్చం రజనీకాంత్ లాగే ఉన్నాడు. ప్రస్తుతం రజనీకాంత్ డూప్ వీడియో, ఫోటోలు వైరల్ అయ్యాయి. 

Also Read :- భర్తపై పోటీకి భార్య

అందరూ అలాగే అనుకుంటారు..

కేరళ రాష్ట్రం పోర్ట్ కొచ్చి పట్టాలం రోడ్ లో తాను 20 ఏండ్ల నుంచి టీ స్టాల్ నడుపుతున్నానని..సుధాకర ప్రభు తెలిపాడు. తన టీ స్టాల్ కు వచ్చిన వారంతా రజనీకాంత్ అనుకుంటారని..కొందరు అయితే తనతో సెల్ఫీలు తీసుకుంటారని చెప్పాడు.