రేషన్ డీలర్ల కమీషన్ విడుదల చేయాలి : రేషన్ డీలర్ల సంఘం

రేషన్ డీలర్ల కమీషన్ విడుదల చేయాలి : రేషన్ డీలర్ల సంఘం
  • ప్రభుత్వానికి డీలర్ల సంఘం వినతి

హైదరాబాద్, వెలుగు: పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న రేషన్ డీలర్ల కమీషన్ వెంటనే విడుదల చేయా లని రేషన్ ​డీలర్ల సంఘం డిమాండ్​ చేసింది. మంగళవారం రేషన్​ డీలర్ల సంఘం నేతలు సివిల్​ సప్లయ్స్​ కమిషనర్ స్టీఫెన్​ రవీంద్రను కలిసి తమ సమస్యను విన్నవించారు.  రాష్ట్రం లోని 17,200 మంది రేషన్ డీలర్లు ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయారని తెలిపారు. 

ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి ఆరు నెలల సెంట్రల్ పూల్​ కమీషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నెల నుంచి  స్టేట్ పూల్​ కమిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రెండేండ్లుగా  గన్నీ సంచుల డబ్బులు పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉండటంతో అప్పుల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు దసరా, దీపావళి పండుగల వేళ కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని, పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న మొత్తం కమీషన్ తక్షణమే విడుదల చేయాలని కోరారు.