
భారత పోస్టల్ శాఖ ఒక కొత్త మార్పు తీసుకొచ్చింది. దింతో ఇప్పుడు మీరు సెప్టెంబర్ 1 నుంచి పోస్టల్ సర్వీసుల్లో రిజిస్టర్డ్ పోస్ట్, స్పీడ్ పోస్ట్ ఇకపై వేర్వేరు సర్వీసులగా కాకుండా ఒకే సర్వీసుగా ఉంటాయి. దీని ద్వారా కస్టమర్లకు మరింత సులభమైన, మెరుగైన సేవలు లభిస్తాయి. అంతేకాదు ఇకపై మీరు ఏదైనా రిజిస్టర్డ్ పోస్ట్ చేయాలనుకుంటే దాన్ని స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే పంపాలి.
రిజిస్టర్డ్ పోస్ట్ : సెప్టెంబర్ 1 నుంచి రిజిస్టర్డ్ పోస్ట్ ఇకపై పోస్టల్ సర్వీసుల్లో ఉండదు. అంటే రిజిస్టర్డ్ పోస్ట్ సేవలు ఇప్పుడు స్పీడ్ పోస్ట్ లో భాగంగా ఉంటాయి. రిజిస్టర్డ్ పోస్ట్ లో ఒకప్పుడు డెలివరీ ప్రూఫ్ ఆటోమాటిక్ గా వచ్చేది. ఇప్పుడు మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా పంపేటప్పుడు డెలివరీ ప్రూఫ్ కావాలి అంటే మీరు మరో రూ.10 చెల్లించాల్సి ఉంటుంది. డెలివరీ ప్రూఫ్ కావాలనుకుంటే బుకింగ్ సమయంలోనే అడిగి తీసుకోవాలి.
స్పీడ్ పోస్ట్ కు ట్రాకింగ్ సిస్టం ఉంటుంది. ఇంతకుముందు రిజిస్టర్డ్ పోస్ట్ కంటే స్పీడ్ పోస్ట్ ట్రాకింగ్ వేగంగా, కచ్చితంగా ఉండేది. ఇప్పుడు అన్ని రిజిస్టర్డ్ పోస్ట్ లు కూడా స్పీడ్ పోస్ట్ సిస్టంలోకి మారాయి కాబట్టి, మీకు బెస్ట్ ట్రాకింగ్, మీ పార్సిల్ ఎక్కడుందో ఈజీగా తెలుసుకోవచ్చు. కావాలనుకుంటే మీరు ఆన్‌లైన్‌లో SMS ద్వారా లేదా కస్టమర్ సర్వీస్ ద్వారా సులభంగా సమాచారం పొందవచ్చు.
ALSO READ : ఏం స్కెచ్ వేశాడ్రా : పోలీస్ బాస్ గా వాట్సాప్ క్రియేట్ చేసి..
స్పీడ్ పోస్ట్ ధరలు పంపించే దూరం, బరువుపై ఆధారపడి ఉంటాయి. అలాగే డెలివరీ సమయం ప్రాంతాన్ని బట్టి మారుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో లేదా బ్రాంచ్ ఆఫీసుల ద్వారా డెలివరీ కావడానికి ఒక రోజు ఎక్కువే పట్టొచ్చు. మీరు ఇప్పటి వరకు రిజిస్టర్డ్ పోస్ట్ ఉపయోగిస్తే ఇకపై అదే సర్వీస్ కోసం స్పీడ్ పోస్ట్ ఉపయోగించాలి. ఒకవేళ మీకు డెలివరీ ప్రూఫ్ కావాలంటే ఎక్స్ట్రా ఛార్జ్ కట్టి తీసుకోవచ్చు. ప్రభుత్వ ఆఫీసులు, కోర్టులు, లీగల్ సంస్థలు కూడా ఈ సిస్టంకి అప్ డేట్ కావాలని పోస్టల్ శాఖ కోరింది.