ఏం స్కెచ్ వేశాడ్రా : పోలీస్ బాస్ గా వాట్సాప్ క్రియేట్ చేసి.. పోలీసులు అందర్నీ టార్గెట్ చేశాడు.. చివరికి ఏమైందంటే..?

ఏం స్కెచ్ వేశాడ్రా : పోలీస్ బాస్ గా వాట్సాప్ క్రియేట్ చేసి.. పోలీసులు అందర్నీ టార్గెట్ చేశాడు.. చివరికి ఏమైందంటే..?

కేరళలోని కొల్లం జిల్లాలో ఒక ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులనే మోసం చేయడానికి ఒక సైబర్ మోసగాడు జిల్లా పోలీస్ ఆఫీసర్ విశు ప్రథీప్ టి.కే. పేరుతో నకిలీ వాట్సాప్ ఖాతా తెరచి ఇతర పోలీసులను డబ్బు అడగడానికి ప్రయత్నించాడు. దీనికి సంబంధించి కొల్లం జిల్లాలోని రూపల్ పోలీసు అధికారులకు +9779702927435 అనే వాట్సాప్ నంబర్ నుంచి మెసేజ్ లు వచ్చాయి. ఇందులో ఉన్నతాధికారి ఫోటోను మోసగాళ్లు ప్రొఫైల్ ఫోటోగా పెట్టి మోసం చేయటానికి ప్రయత్నించారు. 

వెంటనే తనకు రూ.40వేలు అవసరం పడిందని.. వెంటనే డబ్బు పంపమంటూ సదరు అధికారి పేరుతో మోసగాళ్లు కొంతమంది కింది స్థాయి అధికారులకు వాట్సాప్ మెసేజ్ పంపించారు. అధికారులు ముందు నుంచే ఇలాంటి సైబర్ మోసాలు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నాయని తెలుసి అప్రమత్తంగా వ్యవహరించారు. దీంతో వారు డబ్బులు పంపకుండా వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీనిపై పలు సెక్షన్ల కింద కేసు కూడా నమోదు అయ్యింది. 

ALSO READ : టిక్‌టాక్ మళ్ళీ వస్తోంది..

ఫ్రాడ్‌స్టర్ డబ్బు పంపమని ఇచ్చిన బ్యాంకు అకౌంట్ వివరాలు ఢిల్లీకి సంబంధించినదిగా గుర్తించారు. ఆ బ్యాంక్ అకౌంట్ యజమాని పైన విచారణ కొనసాగుతోంది. కేరళలో గత కొంతకాలంగా ఇదే తరహా మోసాలు జరుగుతున్నాయి. కొందరు మోసగాళ్లు పోలీస్ అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ నాయకులు, బిజినెస్ మెన్లు అని నటిస్తూ వాట్సాప్, ఫోన్ ద్వారా డబ్బు అడుగుతున్నారు. ఇప్పటికే కొన్ని ప్రైవేట్ కంపెనీల ఫైనాన్స్ మేనేజర్లు తమ "MD" పేరుతో వచ్చిన మెసేజ్ నమ్మి జేబులు ఖాళీ చేసుకున్న ఘటన కేరళలో జరిగింది. 

సైబర్ మోసాల నుంచి రక్షణ పొందండి ఇలా..
* WhatsApp లేదా ఫోన్ ద్వారా ఎవరైనా డబ్బు అడిగితే – ముందుగా వారి అసలు గుర్తింపును ధృవీకరించండి. వారిని నేరుగా సంప్రదించటం లేదా ఇతర మార్గాల్లో వారికి ఫోన్ కాల్ చేసి అసలు నిజం గురించి తెలుసుకోకుండా డబ్బు పంపొద్దు. 
* ఫోటో అసలైనది అయినా ఆ నంబర్ వారికి చెందినదా కాదా అనేది ముఖ్యంగా పరిశీలించాలి.
* మోసగాళ్లు ఎమర్జెన్సీలో ఉన్నాం అంటూ హడావిడి చేయటం లేదా ఒత్తిడి పెడితే జాగ్రత్త. ఇప్పుడే డబ్బులు కావాలంటున్నారంటే మోసగాడని గుర్తించాలి. 
* మీ బ్యాంక్ వివరాలు అడిగితే షేర్ చేయకుండా వారి అధికారిక ద్వారా క్రాస్ వెరిఫై చేయాలి. తప్పుడు వ్యక్తులని గుర్తిస్తే వెంటనే వివరాలు సైబర్ సెల్ నంబర్ 1930కి తెలపండి.