ఇయ్యాల ఆర్టీసీ కార్గోలో వేలం

ఇయ్యాల ఆర్టీసీ కార్గోలో వేలం

హైదరాబాద్​సిటీ, వెలుగు: ఆర్టీసీ కార్గో విభాగంలో డెలివరీ కాకుండా మిగిలిపోయిన వస్తువులను గురువారం వేలం వేయనున్నట్టు గ్రేటర్​ ఆర్టీసీ అసిస్టెంట్​ ట్రాఫిక్​ మేనేజర్​(లాజిస్టిక్స్​) ఇషాక్ ​బిన్ ​మహ్మద్​ తెలిపారు. జేబీఎస్​లోని లాజిస్టిక్​ విభాగంలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి  5 గంటల వరకు వేలం ఉంటుందన్నారు. ప్రతి నెలా నిర్వహించే వేలంలో వస్తువులను 30 నుంచి 50 శాతం తక్కువకే అమ్ముతున్నారు. ఇందులో గృహోపకరణాలు, టీవీలు, మొబైల్స్ ఉన్నాయి.