టీ20 వరల్డ్ కప్‌‌‌‌ సూపర్‌‌‌‌‌‌‌‌–8 లో పాక్‌‌‌‌ దే ఆఖరి బెర్త్

టీ20 వరల్డ్ కప్‌‌‌‌ సూపర్‌‌‌‌‌‌‌‌–8 లో  పాక్‌‌‌‌ దే ఆఖరి బెర్త్
  • సూపర్‌‌‌‌‌‌‌‌-8కు పాకిస్తాన్‌‌‌‌
  • సాహిబ్జాదా సెంచరీ
  • నమీబియాపై ఘన విజయం

కొలంబో:  ఓపెనర్ సాహిబ్జాదా ఫర్షాన్ (58 బాల్స్‌‌‌‌లో 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 100 నాటౌట్‌‌‌‌) సెంచరీకి తోడు బౌలర్లు కూడా సత్తా చాటడంతో టీ20 వరల్డ్ కప్‌‌‌‌లో పాకిస్తాన్ సూపర్‌‌‌‌‌‌‌‌–8 చివరి బెర్తు సొంతం చేసుకుంది. బుధవారం జరిగిన గ్రూప్‌‌‌‌–ఎ లీగ్ మ్యాచ్‌‌‌‌లో పాక్‌‌‌‌ 102 రన్స్ తేడాతో నమీబియాపై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌‌‌‌కు వచ్చిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 199/3 స్కోరు చేసింది. ఫర్హాన్ స్టార్టింగ్‌‌‌‌ నుంచే భారీ షాట్లతో దంచికొట్టాడు. మరో ఓపెనర్ సైమ్ ఆయుబ్ (14) ఫెయిలైనా.. కెప్టెన్ సల్మాన్ ఆఘా (38)తో రెండో వికెట్‌‌‌‌కు 67 రన్స్ జోడించాడు. ఈ క్రమంలో 38 బాల్స్‌‌‌‌లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్న అతను మరో 20 బాల్స్‌‌‌‌లో వంద మార్కు అందుకున్నాడు.

దాంతో అహ్మద్ షెహ్‌‌‌‌జాద్​ (2014లో బంగ్లాదేశ్‌‌‌‌పై) తర్వాత టీ20 వరల్డ్ కప్‌‌‌‌లో సెంచరీ కొట్టిన పాక్ రెండో ప్లేయర్‌‌‌‌‌‌‌‌గా నిలిచాడు. చివర్లో షాదాబ్ ఖాన్ (36 నాటౌట్‌‌‌‌) కూడా మెరుపులు మెరిపించడంతో పాక్ భారీ స్కోరు చేసింది. జాక్ బ్రెసెల్‌‌‌‌ రెండు వికెట్లు తీశాడు. అనంతరం ఛేజింగ్‌‌‌‌లో నమీబియా 17.3 ఓవర్లలో 97 రన్స్‌‌‌‌కే కుప్పకూలింది. లారెన్ స్టీన్‌‌‌‌కాంప్ (23), అలెక్సాండర్ వోల్షెంక్ (20) తప్ప మిగతా బ్యాటర్లు సింగిల్ డిజిట్‌‌‌‌కే ఔటయ్యారు. పాక్ బౌలర్లలో మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్ (4/16) నాలుగు వికెట్లు పడగొట్టగా.. షాదాబ్ ఖాన్ (3/19) మూడు వికెట్లు తీశాడు. ఫర్హాన్‌‌‌‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. సూపర్‌‌‌‌‌‌‌‌–8లో పాక్ గ్రూప్‌‌‌‌–2లో న్యూజిలాండ్‌‌‌‌, ఇంగ్లండ్‌‌‌‌, శ్రీలంకతో కలిసి ఆడనుంది.