- జడ్చర్లలో సంస్కృతం బదులుగా హిందీ ప్రశ్నాపత్రం ఇచ్చిన ఇన్విజిలేటర్
జడ్చర్ల టౌన్, వెలుగు : మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో ఓ విద్యార్థికి సంస్కృతం పేపర్ బదులుగా హిందీ ప్రశ్నాపత్రాన్ని ఇచ్చారు. బుధవారం సెకండ్ లాంగ్వేజ్ పేపర్–2 హిందీ, తెలుగు, సంస్కృతం సబ్జెక్టులకు పరీక్ష జరిగింది. జడ్చర్లలోని శ్రీ చైతన్య కాలేజీలోనిఎగ్జామ్ సెంటర్లో పొరపాటు జరిగింది. ఆ సెంటర్లో ఎగ్జామ్ రాసేందుకు వచ్చిన ఓ విద్యార్థికి ఇన్విజిలేటర్ సంస్కృతం సబ్జెక్టుకు బదులుగా హిందీ ప్రశ్నాపత్రం అందించాడు.
దీంతో ఆ విద్యార్థి ప్రశ్నాపత్రం అర్థం కాక సెంటర్లోనే ఉండిపోయాడు. పరీక్ష సమయం అయిపోయాక ఇంటికి వచ్చిన విద్యార్థి తల్లిదండ్రులకు ఈ విషయాన్ని చెప్పాడు. దీంతో విద్యార్థి తల్లిదండ్రులు కాలేజీకి చేరుకొని సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ చేసి నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామని డీఐఈవో తెలిపారు.
