
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ శ్రీవారిని దర్శించుకొనేందుకు తిరుమల చేరుకున్నారు. తిరుమల సంప్రదాయం ప్రకారం సోమవారం సాయంత్రం ( ఫిబ్రవరి 26) శ్రీ భూ వరాహ స్వామి వారిని దర్శించుకున్నారు. రాత్రి తిరుమలలో బస చేసి మంగళవారం ( ఫిబ్రవరి 27) విఐపి విరామ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అవినీతి కేసులో జైలుశిక్ష అనుభవించి విడుదలైన తరువాత రెండో సారి స్వామి వారిని దర్శించుకొనేందుకు తిరుమలకు వచ్చారు.