ద్వేషంపై ప్రేమ గెలిచింది.. సత్యమేవ జయతే.. సుప్రీం తీర్పుపై కాంగ్రెస్ హర్షం

ద్వేషంపై ప్రేమ గెలిచింది.. సత్యమేవ జయతే.. సుప్రీం తీర్పుపై కాంగ్రెస్ హర్షం

2019లో ప్రధాని మోదీ ఇంటిపేరుపై చేసిన వ్యాఖ్యల క్రమంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై పరువు నష్టం కేసు నమోదైన విషయం తెలిసిందే. అనంతరం ఆయనకు విధించిన శిక్షపై వాదనలు విన్న సుప్రీంకోర్టు తాజాగా స్టే విధించింది. అంతే కాకుండా ఆయన ఎంపీ హోదాను కూడా పునరుద్ధరించింది. ఈ తరుణంలో సుప్రీంకోర్టు తాజాగా వెలువరించిన తీర్పును కాంగ్రెస్ ప్రశంసించింది. ఇది "ద్వేషంపై ప్రేమ సాధించిన విజయం" అని కాంగ్రెస్ ఈ సందర్భంగా పేర్కొంది.
"ఇది ద్వేషానికి వ్యతిరేకంగా ప్రేమ సాధించిన విజయం. సత్యమేవ జయతే - జై హింద్" అని కాంగ్రెస్ ట్వీట్‌లో పేర్కొంది.

2019లో ప్రధాని నరేంద్ర మోదీని, ఆయన ఇంటిపేరును కించపరిచేలా వ్యాఖ్యానించినందుకు గానీ రాహుల్ గాంధీకి కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ విషయంపై స్పందించిన న్యాయమూర్తులు బిఆర్ గవాయి, పిఎస్ నరసింహ, సంజయ్ కుమార్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం బహిరంగ ప్రసంగాలు చేసేటప్పుడు ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. "గరిష్ట శిక్ష విధించడానికి ట్రయల్ జడ్జి ఎటువంటి కారణం చెప్పలేదు. తుది తీర్పు పెండింగ్‌లో ఉన్నందున దోషిగా నిర్ధారించే ఉత్తర్వును నిలిపివేయాలి" అని బెంచ్ పేర్కొంది. ఇది సంతోషకరమైన రోజు.. ఈరోజే లోక్‌సభ స్పీకర్‌కి లేఖ రాసి మాట్లాడతాను" అని కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి ఈ సందర్భంగా అన్నారు.