రెండో టెస్టు: తొలిరోజే చేతులెత్తేసిన భారత్

రెండో టెస్టు: తొలిరోజే చేతులెత్తేసిన భారత్
  • 202 రన్స్‌‌‌‌కే ఆలౌట్‌‌
  • సౌతాఫ్రికా 35/1
  • వెన్నునొప్పితో కోహ్లీ దూరం

జొహన్నెస్‌‌‌‌‌‌బర్గ్‌‌‌‌: తొలి టెస్టులో గ్రాండ్‌‌‌‌ విక్టరీ తర్వాత కెప్టెన్‌‌‌‌ విరాట్‌‌‌‌ కోహ్లీ లేకుండా బరిలోకి దిగిన టీమిండియా సెకండ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ను చెత్తగా షురూ చేసింది. వెన్నునొప్పి కారణంగా కోహ్లీ దూరం అవడంతో ఆటకు ముందే డీలా పడ్డ టీమ్‌‌‌‌.. బ్యాటింగ్‌‌‌‌లో ఫెయిలైంది. సోమవారం మొదలైన ఈ మ్యాచ్‌‌‌‌లో టాస్‌‌‌‌ నెగ్గి బ్యాటింగ్‌‌‌‌కు దిగిన ఇండియా ఫస్ట్‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌లో  63.1 ఓవర్లలో 202 రన్స్‌‌‌‌కే ఆలౌటైంది. స్టాండిన్‌‌‌‌ కెప్టెన్‌‌‌‌ కేఎల్‌‌‌‌ రాహుల్‌‌‌‌ (50), మిడిలార్డర్‌‌‌‌లో స్పిన్నర్‌‌‌‌ అశ్విన్‌‌‌‌ (46) మాత్రమే రాణించారు. సీనియర్‌‌‌‌ ప్లేయర్లు పుజారా (3), రహానె (0) మళ్లీ నిరాశ పరిచారు. సఫారీ పేసర్లు మార్కో జాన్సెన్‌‌‌‌ (4/31), కగిసో రబాడ (3/64), ఒలివర్‌‌‌‌ (3/64) దెబ్బకు టీమ్‌‌‌‌లో ఐదుగురు సింగిల్‌‌‌‌ డిజిట్‌‌‌‌కే ఔటయ్యారు. అనంతరం బ్యాటింగ్‌‌‌‌కు వచ్చిన సౌతాఫ్రికా ఫస్ట్‌‌‌‌ డే చివరకు తొలి ఇన్నింగ్స్‌‌‌‌లో 18 ఓవర్లో 35/1 స్కోరుతో నిలిచింది.  ఓపెనర్‌‌‌‌ ఐడెన్‌‌‌‌ మార్‌‌‌‌క్రమ్‌‌‌‌ (7)ను షమీ నాలుగో ఓవర్లోనే ఎల్బీ చేసినా.. కెప్టెన్‌‌‌‌ డీన్‌‌‌‌ ఎల్గర్‌‌‌‌ (11 బ్యాటింగ్), కీగన్‌‌‌‌ పీటర్సన్‌‌‌‌ (14 బ్యాటింగ్‌‌‌‌) జాగ్రత్తగా ఆడి డే ముగించారు. పీటర్సన్‌‌‌‌ ఇచ్చిన క్యాచ్‌‌‌‌ను కీపర్‌‌‌‌ పంత్‌‌‌‌ డ్రాప్‌‌‌‌ చేయడం దెబ్బకొట్టింది. ఇండియా ఫస్ట్‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌ స్కోరుకు  హోమ్‌‌‌‌టీమ్‌‌‌‌ ఇంకా 167 రన్స్‌‌‌‌ దూరంలో ఉంది. సఫారీ బౌలర్ల మాదిరిగా ఇండియన్స్‌‌‌‌ సెకండ్‌‌‌‌ డే మార్నింగ్‌‌‌‌ సెషన్‌‌‌‌లో వరుసగా వికెట్లు తీస్తేనే  రేసులోకి వస్తారు.
రాహుల్‌‌‌‌, అశ్విన్‌‌‌‌ ఇద్దరే
సెంచూరియన్‌‌‌‌లో బాగా ఆడిన టీమిండియా తమకు అచ్చొచ్చిన వాండరర్స్‌‌‌‌లో ఫస్ట్‌‌‌‌ డే ఫ్లాప్‌‌‌‌ షో చేసింది. ఈ పిచ్‌‌‌‌పై బౌన్స్‌‌‌‌, సీమ్‌‌‌‌ను యూజ్‌‌‌‌ చేసుకుంటూ సఫారీ పేసర్లు విసిరిన సవాల్‌‌‌‌కు మనోళ్లు బ్యాట్లెత్తేశారు. సీమింగ్‌‌‌‌ కండీషన్స్‌‌‌‌లో మరో ఓపెనర్‌‌‌‌ మయాంక్‌‌‌‌ (26)తో కలిసి రాహుల్‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌ను మంచిగానే స్టార్ట్‌‌‌‌ చేశారు. ఫస్ట్‌‌‌‌ వికెట్‌‌‌‌కు ఈ ఇద్దరూ 36 రన్స్‌‌‌‌ యాడ్​ చేశారు. అయితే, డ్రింక్స్‌‌‌‌ తర్వాత జాన్సెన్‌‌‌‌  బౌలింగ్​లో మయాంక్‌‌‌‌ కీపర్‌‌‌‌కు క్యాచ్‌‌‌‌ ఇచ్చాడు. ఆ వెంటనే మరో పేసర్‌‌‌‌ ఒలివర్‌‌‌‌  వరుస బాల్స్‌‌‌‌లో పుజారా, రహానెను ఔట్‌‌‌‌ చేసి ఇండియాకు డబుల్‌‌‌‌ షాకిచ్చాడు. 53/3తో లంచ్‌‌‌‌కు వెళ్లొచ్చిన తర్వాత  విహారి (20)తో కలిసి రాహుల్‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌ను గాడిలో పెట్టే ప్రయత్నం చేశాడు. ఫామ్‌‌‌‌లో ఉన్న రాహుల్‌‌‌‌..చాలా ఓపిగ్గా ఆడాడు. షార్ట్‌‌‌‌బాల్స్‌‌‌‌ను బాగా ఎదుర్కొన్నాడు. తన పుల్‌‌‌‌షాట్స్‌‌‌‌ గ్రౌండ్‌‌‌‌ మీదుగా వెళ్లేలా చూసుకున్నాడు. కానీ, ఈ ఇద్దరూ క్రీజులో కుదురుకున్న టైమ్‌‌‌‌లో  రబాడ బౌలింగ్‌‌‌‌లో షార్ట్‌‌‌‌లెగ్‌‌‌‌లో డుసెన్‌‌‌‌ పట్టిన సూపర్బ్‌‌‌‌ క్యాచ్‌‌‌‌కు విహారి ఔటయ్యాడు. ఇక, అప్పటిదాకా బాగానే ఆడి ఫిఫ్టీ కంప్లీట్‌‌‌‌ చేసుకున్న రాహుల్‌‌‌‌.. జాన్సెన్‌‌‌‌ వేసిన షార్ట్‌‌‌‌బాల్‌‌‌‌ను ఫుల్‌‌‌‌ చేసి రబాడకు క్యాచ్​ ఇచ్చాడు. దాంతో, 116/5తో ఇండియా కష్టాల్లో పడగా.. పంత్‌‌‌‌ (17), అశ్విన్‌‌‌‌ ఆరో వికెట్‌‌‌‌కు 40 రన్స్‌‌‌‌ యాడ్‌‌‌‌ చేశాడు. కానీ, ఓపిగ్గా ఆడుతున్న పంత్‌‌‌‌ను టీ తర్వాత కీపర్‌‌‌‌ క్యాచ్‌‌‌‌తో ఔట్‌‌‌‌ చేసిన జాన్సెన్‌‌‌‌ ఇండియాను మళ్లీ దెబ్బకొట్టాడు. శార్దూల్‌‌‌‌ (0), షమీ (9) ఫెయిలైనా  అశ్విన్‌‌‌‌ బాల్‌‌‌‌కో రన్‌‌‌‌ తీశాడు. ఫిఫ్టీకి దగ్గరైన అతడిని జాన్సెన్‌‌‌‌ ఔట్‌‌‌‌ చేసినా.. చివర్లో బుమ్రా (14 నాటౌట్) రెండు ఫోర్లు, ఓ సిక్స్‌‌‌‌ కొట్టడంతో స్కోరు 200 దాటింది. 
స్కోర్లు
ఇండియా ఫస్ట్‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌: 63.1 ఓవర్లలో 202 ఆలౌట్‌‌‌‌ (రాహుల్‌‌‌‌ 50, అశ్విన్‌‌‌‌ 46, జాన్సెన్‌‌‌‌ 4/31).
సౌతాఫ్రికా ఫస్ట్‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌: 18 ఓవర్లలో 35/1 (ఎల్గర్ 11 బ్యాటింగ్‌‌‌‌, పీటర్సన్‌‌‌‌ 14 బ్యాటింగ్‌‌‌‌, షమీ 1/15).