కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్.. సీనియర్ నేత బాబా సిద్ధిఖ్ రాజీనామా

కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్.. సీనియర్ నేత బాబా సిద్ధిఖ్ రాజీనామా

పార్లమెంట్ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మహారాష్ట్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత బాబా సిద్ధిఖ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఫిబ్రవరి 8వ తేదీ గురువారం ఆయన తన ఎక్స్ ఖాతా వేదికగా కాంగ్రెస్ ను వీడుతున్నట్లు ప్రకటించారు.  కాంగ్రెస్ పార్టీతో ఉన్న 48 ఏళ్ల అనుబంధానికి బాబా సిద్ధిఖ్ ముగింపు పలుకుతున్నట్లు తెలిపారు. తన రాజీనామాకు గల కారణాలు చాలా ఉన్నాయని, కానీ కొన్ని చెప్పకపోవడమే మంచిదని.. ఈ ప్రయాణంలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఒతలు తెలుపుతున్నానని సిద్దిఖ్ చెప్పారు.

మహారాష్ట్రలోని వాండ్రే పశ్చిమ విధానసభ నియోజకవర్గానికి శాసనసభ సభ్యుడుగా సిద్ధిఖ్ పనిచేశారు. ఇటీవల మహారాష్ట్ర మాజీ మంత్రి మిలింద్‌ దేవరా కాంగ్రెస్‌కు రాజీనామా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కొన్ని రోజులకే సిద్దిఖ్ కూడా కాంగ్రెస్ కు రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. సీనియర్లు ఒకరి తర్వాత ఒకరు.. పార్టీని వీడుతుండడం కాంగ్రెస్ ను కలరవపెడుతోంది. త్వరలోనే మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్ సిపి పార్టీలో బాబా సిద్ధిఖ్ చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది.