శంషాబాద్, వెలుగు: చార్మినార్ జోన్ వద్దు.. శంషాబాద్ జోన్ ముద్దు అంటూ శంషాబాద్ మున్సిపాలిటీ ఆల్ పార్టీ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం 2 వేల మంది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద బెంగళూరు–హైదరాబాద్ జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. శంషాబాద్ ను నాలుగు జోన్లుగా ఏర్పాటు చేయాలని డిమాండ్చేశారు. భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని జేఏసీ నాయకులను పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శంషాబాద్ జోన్ ప్రకటించే శాంతియుత నిరసనలు కొనసాగిస్తామని, రాబోయే రోజుల్లో వంటావార్పు తదితర కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. నాయకులు కొనమోల శ్రీనివాస్, మాడపతి పరమేశ్వరి, మాజీ కౌన్సిలర్ బుచ్చిరెడ్డి, జిల్లా ఆనంద్, ప్రణయ్, పరంధాములు, రాచమల్లు రమేశ్, గిరి, ప్రణయ్, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
