అమెరికాలో కాల్పులు : ఐదుగురు మృతి

అమెరికాలో కాల్పులు : ఐదుగురు మృతి

అమెరికాలోని లాస్ వెగాస్ సమీపంలో సోమవారం రాత్రి వరుస కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు మరణించగా, 13 ఏళ్ల బాలిక తీవ్రంగా గాయపడింది. చనిపోయిన వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. నార్త్ లాస్ వెగాస్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ఎరిక్ ఆడమ్స్‌(57)ని నిందితునిగా  గుర్తించింది. అతను మంగళవారం ఉదయం పోలీసులు ఎదరు కాల్పులు చేస్తున్నప్పుడు ఆత్మహత్య చేసుకున్నాడు. నార్త్ లాస్ వెగాస్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో సోమవారం రాత్రి జరిగిన కాల్పులు పోలీసులకు ఆలస్యంగా సమాచారం అందింది. బాధితులను ఆస్పత్రికి తరలించారు. ఆడమ్స్ ను పోలీసులు వెంబడించారు. చివరికి అతను తుపాకీతో కాల్చుకొని చనిపోయాడు.