పది వేల మందిని ఎంట్రప్రెనార్లను చేస్తాం: శ్రేయాస్ గ్రూప్ ఫౌండర్ శ్రీనివాస్ రావు

పది వేల మందిని ఎంట్రప్రెనార్లను చేస్తాం: శ్రేయాస్ గ్రూప్ ఫౌండర్ శ్రీనివాస్ రావు

హైదరాబాద్​, వెలుగు: మూవీ ఈవెంట్స్ సంస్థ శ్రేయాస్ గ్రూప్ తెలుగు రాష్ట్రాల్లో 10 వేల మంది ఎంట్రప్రెనార్లను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. మీడియా, ఈవెంట్స్, స్పోర్ట్స్, రియల్టీల్లో   విస్తరిస్తామని వ్యవస్థాపకుడు గండ్ర శ్రీనివాస్ రావు ప్రకటించారు.  యువతకు ఎటువంటి పెట్టుబడి అవసరం లేని వ్యాపార అవకాశాలు కల్పిస్తామని ఆయన తెలిపారు. 

 తమ సొంత ప్రాంతాల్లోనే శ్రేయాస్ ప్రతినిధులుగా చేరి ఆదాయం పొందవచ్చు. 15 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ సంస్థ ఇప్పటికే ఐదు వేలకుపైగా ఈవెంట్స్ నిర్వహించింది. ఇప్పుడు హిందీ, పంజాబీ వంటి భాషల చిత్ర పరిశ్రమలకు విస్తరిస్తోంది.  ఖమ్మంలోనూ తొలి ప్రాజెక్టును చేపట్టింది.  ఏఐ  ఆధారిత వీడియో ప్రొడక్షన్ స్టూడియోతో పాటు ఎనీ టైమ్ థియేటర్ వంటి వేదికలను ప్రారంభించామని శ్రీనివాస్ రావు వివరించారు.