గుడ్ న్యూస్: ఇక నుంచి మెట్రో స్టేషన్లలో స్మార్ట్ లాకర్లు.. మీ సామాన్లు డిజిటల్గా భద్రపరుచుకోవచ్చు !

గుడ్ న్యూస్: ఇక నుంచి మెట్రో స్టేషన్లలో స్మార్ట్ లాకర్లు.. మీ సామాన్లు డిజిటల్గా భద్రపరుచుకోవచ్చు !

ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది హైదరాబాద్ మెట్రో. ప్రయాణంలో భాగంగా మోసుకెళ్లాల్సిన అవసరం లేదు అనుకునే సమాన్లను మెట్రో స్టేషన్లలోనే స్టోర్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది . అన్ని మెట్రో స్టేషన్లలో స్మార్ట్ లాకర్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేసింది. అందులో భాగంగా ముందుగా ఏడు స్టేషన్లలో స్మార్ట్ లాకర్లను శుక్రవారం (నవంబర్ 28) ప్రారంభించింది. 

ఎల్  అండ్ టీ  మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్ (L&TMRHL), టక్కీట్ (TUCKI)తో భాగస్వామ్యం చేసుకుని, హైదరాబాద్ నగరంలోని ఏడు మెట్రో స్టేషన్లలో ఆన్-డిమాండ్ స్మార్ట్ స్టోరేజ్ లాకర్ల సౌకర్యంను ప్రారంభించింది.  హైదరాబాద్ మెట్రో స్టేషన్లలో ప్రయాణికులకు సౌకర్యం పెంచటంతో పాటుగా యుటిలిటీ ఆధారిత సేవలను విస్తరించడంలో ఇది ఒక ముఖ్యమైన ముందడుగుగా అభివర్ణిస్తున్నారు. 

హెల్మెట్లు, సామాను, షాపింగ్ బ్యాగులు, బ్యాక్‌ప్యాక్‌లు సహా ఇతర వ్యక్తిగత వస్తువులను సురక్షితంగా భద్రపరచడం దీని ఉద్దేశం. దీంతో ప్రయాణికులు ఎలాంటి ప్రయాస లేకుండా ప్రశాంతంగా  ప్రయాణించే అవకాశం కలుగుతుంది. స్మార్ట్ లాకర్స్ ప్రారంభ కార్యక్రమం ఉప్పల్ మెట్రో స్టేషన్‌లో జరిగింది. 

స్కాన్ అండ్  స్టోర్ అనుభవం: 

టక్కీట్  స్మార్ట్ లాకర్లు సౌకర్యవంతమైన స్టోరేజ్ అనుభవాన్ని అందిస్తాయి.  ప్రయాణికులు  మూడు విధాలుగా కేవలం 30 సెకన్లలోపు స్మార్ట్ లాకింగ్ చేయవచ్చు. అది ఎలాగంటే..

  • ముందుగా లాకర్ ప్యానెల్‌లో ఉండే QR కోడ్‌ను స్కాన్ చేయాలి
  • తమ వస్తువు ఆధారంగా లాకర్ ఏ పెద్దదో చిన్నది కావాలో ఎంచుకోవాలి
  • ఎంతసేపు స్టోర్ చేయాలనుకుంటే అంత మొత్తాన్ని డిజిటల్‌గా చెల్లించాలి

ఈ భాగస్వామ్యం ద్వారా, L&T, టక్కీట్ హైదరాబాద్ మెట్రో స్టేషన్‌లను మల్టీ -యుటిలిటీ హబ్‌లుగా మార్చనున్నాయి. ప్రయణీకులు దూరం వెళ్లే క్రమంలో లగేజ్ ప్రయాస లేకుండా జర్నీ కంఫర్ట్ గా ఉండేలా స్మార్ట్ టెక్నాలజీ ద్వారా ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నారు. 

 టక్కీట్  తో మా భాగస్వామ్యం, మా స్టేషన్లలోకి స్మార్ట్, సురక్షితమైన, అనుకూలమైన స్టోరేజ్ పరిష్కారాన్ని తీసుకువస్తుందని ఈ సందర్భంగా L&TMRHL ఎండి  & సీఈఓ శ్రీ కెవిబి రెడ్డి అన్నారు. ఇది ప్రయాణికులకు రోజువారీ ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తుందన్నారు. 

ప్రస్తుతానికి ఈ స్టేషన్లలోనే స్మార్ట్ లాకర్లు:

తొలుత స్మార్ట్ లాకర్ల సేవలు 7 స్టేషన్లలో లభ్యమవుతున్నాయి.  అవి: మియాపూర్, అమీర్‌పేట్, పంజాగుట్ట, ఎల్ బి  నగర్, ఉప్పల్, పరేడ్ గ్రౌండ్, హై-టెక్ సిటీ.  
మరిన్ని వివరాల కోసం వెబ్‌సైట్: http://www.tuckit.in/ ని సందర్శించండి.