రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహం

రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహం
  • ఘంటసాల విగ్రహం పక్కన పెట్టేందుకు నిర్ణయం

బషీర్​బాగ్, వెలుగు: గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కాంస్య విగ్రహాన్ని హైదరాబాద్ రవీంద్ర భారతి ఆవరణలో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా విగ్రహా ఏర్పాటు కమిటీ సభ్యులు సాంస్కృతిక శాఖ అధికారుల సమక్షంలో విగ్రహ స్థాపన స్థలాన్ని గురువారం పరిశీలించారు. ప్రస్తుతం రవీంద్ర భారతి ప్రాంగణంలో ఉన్న ఘంటసాల వెంకటేశ్వరరావు కాంస్య విగ్రహానికి పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని వారు నిర్ణయించారు.