ఫోన్ ట్యాపింగ్: ఎస్ఐబీ కేంద్రంగా ఆపరేషన్ పొలిటికల్ లీడర్స్

ఫోన్ ట్యాపింగ్: ఎస్ఐబీ కేంద్రంగా ఆపరేషన్ పొలిటికల్ లీడర్స్

హైదరాబాద్: ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కథంతా బీఆర్​ఎస్​ సుప్రీం కనుసన్నల్లోనే నడిచినట్లు వెల్లడైంది. గత బీఆర్‌‌‌‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఏ ఎన్నికలొచ్చినా గులాబీ పార్టీని గెలిపించడమే లక్ష్యంగా టాస్క్​ఫోర్స్​ పోలీసులు పనిచేసినట్టు తేటతెల్లమైంది. 

నాటి ఇంటెలిజెన్స్​ చీఫ్ ప్రభాకర్ రావు సారథ్యంలో ప్రణీత్‌‌రావు టీమ్‌‌ ఆపరేషన్‌‌ బీఆర్‌‌‌‌ఎస్‌‌ టార్గెట్స్ ప్రారంభించింది. బేగంపేటలోని ఎస్ఐబీ ఆఫీస్‌‌లో స్పెషల్‌‌ ఆపరేషన్స్ టార్గెట్స్‌‌ కోసం లాగర్‌‌‌‌ రూమ్‌‌లో ప్రణీత్‌‌రావుకు రెండు గదులను కేటాయించారు. ఇన్‌‌స్పెక్టర్‌‌‌‌, ఎస్‌‌ఐ స్థాయి అధికారులను నియమించారు. పొలిటికల్ టార్గెట్స్‌‌ను ట్రాక్ చేసేందుకు వాట్సాప్‌‌, సిగ్నల్‌‌, స్నాప్‌‌చాట్‌‌ సహా పదుల సంఖ్యలో సోషల్‌‌మీడియా యాప్స్‌‌ను వినియోగించారు. వీటితో పాటు అత్యాధునిక టెక్నాలజీతో టూల్స్‌‌ ఏర్పాటు చేసుకున్నారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది సేకరించిన ఫోన్ నంబర్స్‌‌ ఆధారంగా బీఆర్‌‌‌‌ఎస్‌‌ అధినేత సూచించిన వారిని టార్గెట్ చేసేవారు.

ప్రభాకర్‌‌‌‌ రావు ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్‌‌ 

రాధాకిషన్‌‌ రావు రిమాండ్‌‌ రిపోర్ట్‌‌లో తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అప్పటి బీఆర్ఎస్​ ప్రభుత్వం తమ సామాజిక వర్గానికి చెందిన వారిని ఉన్నత స్థానంలో నియమించింది. 2016లో టీ ప్రభాకర్ రావుకు ఇంటెలిజెన్స్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌లో డీఐజీగా పోస్టింగ్‌‌ ఇచ్చింది. ప్రభాకర్​రావు తన సామాజిక వర్గంలో నమ్మకమైన వారితో స్పెషల్‌‌ టీమ్‌‌ను ఏర్పాటు చేసుకున్నారు. దుగ్యాల ప్రణీత్‌‌రావుతో పాటు  రాచకొండ కమిషనరేట్‌‌ పరిధిలో పనిచేస్తున్న భుజంగరావు, సైబరాబాద్‌‌ నుంచి వేణుగోపాల్ రావు, హైదరాబాద్ సిటీ కమిషనరేట్‌‌లో పనిచేస్తున్న తిరుపతన్నను నియమించుకున్నారు. ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు.

ప్రభాకర్ రావు స్పెషల్ ఆపరేషన్స్‌‌ టార్గెట్స్‌‌

సిటీపై పోలీస్‌‌ పట్టు సాధించేందుకు రాధాకిషన్‌‌ రావు తన టీమ్‌‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో భాగంగా ఇన్‌‌స్పెక్టర్‌‌‌‌ గట్టుమల్లు భూపతిని వెస్ట్‌‌జోన్‌‌ టాస్క్‌‌ఫోర్స్‌‌ డీసీపీగా నియమించుకున్నారు. గట్టుమల్లు 2021 వరకు రాధాకిషన్ రావుతో కలిసి ఆపరేషన్స్ నిర్వహించారు. పొలిటికల్‌‌ లీడర్స్ టార్గెట్‌‌గా అప్పటికే ఏర్పాటు చేసిన స్పెషల్ ఆపరేషన్స్‌‌ టార్గెట్స్‌‌ (ఎస్‌‌ఓటీ)కు ప్రణీత్‌‌రావును చీఫ్‌‌గా నియమించారు.ఈ టీమ్‌‌లో గట్టుమల్లుకు పోస్టింగ్‌‌ ఇవ్వాలని చీఫ్ ప్రభాకర్‌‌రావుకు రాధాకిషన్ రావు రెకమండ్ చేశారు. దీంతో ప్రణీత్‌‌రావు టీమ్‌‌తో గట్టుమల్లు కలిసి అనేక ఆపరేషన్స్‌‌లో పాల్లొన్నారు.