సమ్మర్ సెలవుల్లో స్పెషల్ ట్రైన్లు పొడిగింపు

 సమ్మర్ సెలవుల్లో స్పెషల్ ట్రైన్లు పొడిగింపు

హైదరాబాద్​సిటీ, వెలుగు: వేసవి సెలవులను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం నడుస్తున్న పలు స్పెషల్ ట్రైన్లను మరికొంత కాలం పొడిగిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. చర్లపల్లి–నహర్​ లగున్​ మధ్య ప్రతి శనివారం నడిచే రైలును ఈనెల 10వ తేదీ నుంచి 31వ తేదీ వరకు పొడిగించారు. నహర్​లగున్– చర్లపల్లి మధ్య ప్రతి మంగళవారం నడిచే ప్రత్యేక రైలును13వ తేదీ నుంచి జూన్ 3 వరకు పొడిగించారు.