బొమ్మరిల్లు భాస్కర్‌తో.. సిద్దూ నెక్స్ట్‌ సినిమా ఫిక్స్

బొమ్మరిల్లు భాస్కర్‌తో.. సిద్దూ నెక్స్ట్‌ సినిమా ఫిక్స్

డీజే టిల్లు సక్సెస్ తరువాత వరుస సినిమాలు చేస్తూ ఫుల్ స్పీడ్ లో ఉన్నాడు స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ( SidduJonnalagadda). ప్రస్తుతం డీజే టిల్లుకు సీక్వెల్ గా వస్తున్న టిల్లు స్క్వేర్ లో నటిస్తున్న ఈ యంగ్ హీరో.. ఈ సినిమా తరువాత కూడా క్రేజీ ప్రాజెక్ట్స్ ను లైన్లో పెట్టేశారు. లేటెస్ట్ గా బొమ్మరిల్లు భాస్కర్‌(Bhaskar)తో సిద్దూ నెక్స్ట్‌ సినిమా ఫిక్స్ అయింది. అంతేకాదు ఇవాళ  ఆగస్టు 10న ఈ సినిమాకు ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్(B. V. S. N. Prasad) ఈ సినిమాను నిర్మించనున్నారని సమాచారం..ఈ మూవీ  ఇవాళ(Aug10న) పూజా కార్యక్రమంతో అధికారికంగా ప్రారంభించబడింది. ఈ ఈవెంట్ కు స్టార్ బాయ్ సిద్దుజొన్నలగడ్డ దర్శకత్వం వహించగా..గీత ఆర్ట్స్ ప్రొడ్యూసర్ అల్లుఅరవింద్  క్లాప్ కొట్టాగా..దిల్‌రాజు గారు కెమెరా స్విచ్ ఆన్ చేసారు. 

చాలా రోజుల తరువాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమాతో అఖిల్ కు మంచి హిట్ అందించిన దర్శకుడు భాస్కర్.. సిద్దు కోసం అవుట్ అండ్ అవుట్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ ను సిద్ధం చేశాడట. కథ నచ్చడంతో సిద్దు కూడా వెంటనే ఒకే చెప్పేశాడట. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సంస్థ(SVCC) ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సినిమాలోని మిగిలిన నటీనటుల గురించిన ఇతర వివరాలు త్వరలో అధికారికంగా ప్రకటించబడతాయి.

ఈ న్యూస్ తెలుసుకున్న సిద్దు ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి తరువాతి సినిమాలో కూడా సిద్దు నటించనున్నాడని వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఇలా వరుస క్రేజీ ప్రాజెక్ట్స్ ను లైన్లో పెడుతూ మిగతా యంగ్ హీరోలకు టఫ్ ఫైట్ ఇస్తున్నారు సిద్దు. మరి ఈ రెండు సినిమాలు కూడా ఒకే అయ్యి విజయాలు సాధిస్తే మాత్రం.. సిద్దు స్టార్ హీరోల లిస్టులోకి రావడం ఖాయం అనే కామెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి.