సుఖేష్ చంద్రశేఖర్ మరో సంచలన లేఖ

సుఖేష్ చంద్రశేఖర్ మరో సంచలన లేఖ

మనీలాండరింగ్ కేసులో తీహార్ జైల్లో ఉన్న కన్‌మన్  సుఖేష్ చంద్రశేఖర్ మరో షాకింగ్ న్యూస్ వెల్లడించాడు.  జైలు నుంచి  ఢిల్లీ సీఎం  అరవింద్ కేజ్రీవాల్‌కు రెండు పేజీల లేఖను విడుదల చేశాడు.  కేజ్రీవాల్, సత్యేంద్ర జైన్ సూచనతో తాను హైదరాబాద్లోని బీఆర్ఎస్ ఆఫీసులో  ఆ పార్టీ నేతకు రూ.15 కోట్లు ఇచ్చానని లేఖలో పేర్కొన్నాడు. అంతేకాకుండా బీఆర్ఎస్ లీడర్‌తో జరిగిన వాట్సాప్ చాట్‌ను కూడా లేఖలో ప్రస్తావించాడు. తనతో చాట్ చేసిన వ్యక్తి సౌత్ గ్రూప్‌లోని బీఆర్ఎస్ లీడర్‌ అని తెలిపాడు. రేంజ్ రోవర్ (కారు నెం 6069) పార్క్ చేసి ఉందని సుఖేష్ అన్నాడు. ఆ కారుపై ఎమ్మెల్సీ స్టిక్కర్ ఉందని చెప్పాడు. ఏపీ అంటే అరుణ్ పిళ్లై అని స్పష్టం చేశాడు. అవసరమైతే తాను నార్కో టెస్ట్‌కు సిద్ధమని సుఖేష్  ప్రకటించాడు. ఇది టీజరేనని ..అసలైన బ్లాక్ బస్టర్ ముందుందని కేజ్రీవాల్‌ను సుఖేష్ చంద్రశేఖర్ హెచ్చరించాడు.

సుఖేష్‌ చంద్రశేఖర్‌ మార్చి 31వ తేదీన కూడా ఓ సంచలన లేఖను విడుదల చేశాడు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ చెప్పినట్టు బీఆర్ఎస్ నేతకు రూ.75 కోట్లు ఇచ్చానని లేఖలో పేర్కొన్నారు. బీఆర్ఎస్ కార్యాలయం ఎదుట పార్కింగ్ చేసిన రేంజ్ రోవర్ కారులో ఉన్న వ్యక్తి రూ. 15 కోట్లు ఇచ్చానని తెలిపాడు.  2020లో సీఎం కేజ్రీవాల్, సత్యేంద్రజైన్ చెప్పినట్లు బీఆర్ఎస్ ఆఫీస్ వద్దకు వచ్చి రేంజ్ రోవర్ కారులో ఉన్న ఏపీ అనే వ్యక్తికి రూ.15 కోట్లు ఇచ్చానన్నాడు.  ఏపీ లిక్కస్ స్కాం కేసు నిందితుల్లో ఒకరని పేర్కొన్నాడు.   చాటింగ్ లో కొన్ని కోడ్ పదాలు వాడినట్టు చెప్పాడు. 15 కేజీల నెయ్యి పేరిట రూ.15 కోట్లు తరలించానని తెలిపాడు. త్వరలో కేజ్రీవాల్ తో తాను చేసిన వాట్సాప్ చాటింగ్ విషయాలు బయటకు పెడతాయన్నాడు.  ఈ వ్యవహారంలో అరవింద్ కేజ్రీవాల్‌తో తాను మొత్తం 700 పేజీల వాట్సాప్, టెలిగ్రామ్ చాట్‌లు చేశానన్నాడు. కేజ్రీవాల్‌కు 75 కోట్లు డెలివరీ చేశాడని పేర్కొన్నాడు.