పెట్రోల్ & డీజిల్ లగ్జరీ కార్లు వాడేవారిపై పిడుగు పడింది. లక్షలు, కోట్లు పోసి ఎంతో ఇష్టపడి కొన్న లగ్జరీ కార్లను క్రమంగా నిషేధించాలని భారత సుప్రీంకోర్టు సూచించింది. ముఖ్యంగా ఢిల్లీ, NCRలో వాయు కాలుష్యం(air pollution) భయంకరమైన స్థాయికి చేరుకోవడంతో ఈ ప్రకటన వచ్చింది. ఎలక్ట్రిక్ కార్ల తయారీ, అమ్మకాలపై ప్రభుత్వ పథకాలు, ప్రోత్సాహకాలు ఉన్న కూడా భారతదేశంలో అమ్ముడవుతున్న లగ్జరీ కార్లలో ఎక్కువ భాగం పెట్రోల్ లేదా డీజిల్ ఇంజిన్‌తో నడుస్తున్నవే...
దీనిపై సంబంధిత మంత్రిత్వ శాఖలు ప్రస్తుత ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన విధానాలను మరోసారి పరిశీలించాలని కోరాయి. లగ్జరీ EVల మార్కెట్ వాటా ఇప్పుడు మాస్-మార్కెట్ మోడళ్ల కంటే చాలా ఎక్కువగా ఉంది.
సుప్రీంకోర్టు నిషేధం ఎందుకు: ఎలక్ట్రిక్ కార్లు పెట్రోల్/డీజిల్ కార్లలాగానే లగ్జరీ కోషెంట్‌ను అందిస్తున్నప్పటికీ, సంపన్న కొనుగోలుదారులు, కంపెనీలు రెండో అప్షన్ ఎంచుకుంటూనే ఉన్నాయని జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. ప్రతిపాదించిన నిషేధం సామాన్యులకు ఏ విధంగానూ ఆటంకం కలిగించదని, అత్యంత హై-ఎండ్ పెట్రోల్ లేదా డీజిల్ మోడల్‌లు మాత్రమే దీనికి లోబడి ఉంటాయని కూడా జస్టిస్ హైలైట్ చేశారు.
ఎవరిపై ప్రభావం : భారతదేశంలో చాల లగ్జరీ బ్రాండ్లు ఎలక్ట్రిక్ మోడళ్లను అమ్మకానికి పెట్టినప్పటికీ, చాలా మంది సంపన్నులు వాటిని దాటి పెట్రోల్ లేదా డీజిల్ అప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నారు. దీనిని అమలు చేస్తే జనాభాలోని ఈ విభాగం పూర్తిగా ఎలక్ట్రిక్‌గా మారడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. కంబషన్-పవర్డ్ తో నడిచే హై-ఎండ్ కంపెని కార్లపై ఈ నిర్ణయం ప్రభావం చూపుతుంది.
ఎప్పటినుంచి అమలు : ఈ నిషేధం కోసం సుప్రీంకోర్టు ఎటువంటి గడువును నిర్ణయించలేదు, ఎందుకంటే ప్రస్తుతానికి పరిశీలనలో మాత్రమే ఉంది. అయితే, ప్రస్తుత ఎలక్ట్రిక్ వాహనాల విధానాలను (నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ ప్లాన్ వంటివి) రూపొందించి అమలు చేసే పునఃసమీక్షించాల్సిన అవసరం గురించి వివిధ మంత్రిత్వ శాఖలను ప్రశ్నించింది. సుప్రీం కోర్టు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చే పూర్తి రిపోర్ట్ డిసెంబర్‌లో ప్రభుత్వం నుండి ఆశించవచ్చు.
ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్: భారతదేశంలో, లగ్జరీ కార్ల విభాగంలో EVల వాటా 12 శాతం వరకు ఉంది, ఇది మాస్-మార్కెట్ విభాగంలో కేవలం 2-3 శాతం మాత్రమే. ఈ ఆర్థిక సంవత్సరం మొదట్లో BMW, మెర్సిడెస్-బెంజ్ EV అమ్మకాలు ఎందుకు పెరిగాయో చూపిస్తుంది. రూ.1 కోటి కంటే ఎక్కువ విలువైన లగ్జరీ కార్లు గతంలో కంటే వేగంగా కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి.
