వీధి కుక్కలపై దేశ వ్యాప్తంగా కొత్తగా వచ్చిన 10 రూల్స్ ఇవే : ప్రతి ఒక్కరూ తెలుసుకోండి..

వీధి కుక్కలపై దేశ వ్యాప్తంగా కొత్తగా వచ్చిన 10 రూల్స్ ఇవే : ప్రతి ఒక్కరూ తెలుసుకోండి..

ఢిల్లీ NCRలో మొత్తం వీధి కుక్కలను తొలగించి షెల్టర్లకు తరలించాలని జారీ చేసిన ఆదేశాలను సుప్రీంకోర్టు ఇవాళ  సవరించింది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్.వి. అంజరియాతో ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ నిర్ణయాన్ని మార్చింది. హాని చేసే లేదా క్రూరంగా ఉండే కుక్కలను మాత్రమే షెల్టర్లకు తరలించాలని కోర్ట్ స్పష్టం చేసింది. అలాగే వీధి కుక్కలకు ఆహారం పెట్టడం, మళ్ళీ వాటిని వొదిలేయడం, దత్తత తీసుకోవడం వంటి విషయాలపై కూడా మార్గదర్శకాలను సుప్రీంకోర్టు సూచించింది. 

కీలక ఆదేశాలు:
కోపంగా ఉండే కుక్కలను మాత్రమే : గతంలో వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని ఇచ్చిన ఆదేశాలను సవరిస్తూ హాని చేసే లేదా క్రూరంగా ఉండే కుక్కలను మాత్రమే షెల్టర్ హోమ్‌లలో ఉంచాలని కోర్టు పేర్కొంది.

కుక్కలకు ఆహారం: వీధి కుక్కలకు ఆహారం పెట్టేందుకు మున్సిపాలిటీలు ప్రత్యేక ప్రాంతాలను గుర్తించాలని, ఆ ప్రదేశాల్లో మాత్రమే ఆహారం పెట్టాలని కోర్టు ఆదేశించింది.

 కుక్కల విడుదల: టీకాలు వేసిన లేదా స్టెరిలైజేషన్ చేసిన కుక్కలను తిరిగి వాటి ప్రదేశాలలో విడుదల చేయాలి.

విధి కుక్కల దత్తత: జంతు ప్రేమికులు డాగ్ షెల్టర్లలోని కుక్కలను దత్తత తీసుకోవచ్చు. ఇందుకు ప్రభుత్వ అధికారులు సహకరించాలి.

మున్సిపల్ చర్యలు : జంతు జనన నియంత్రణ (Animal Birth Control) నిబంధనలకు అనుగుణంగా కుక్కలను తరలించే మున్సిపల్ అధికారుల చర్యలను ఎవరూ అడ్డుకోవద్దు. 

నిబంధనల ఉల్లంఘిస్తే చర్యలు: ఎవరైనా వీధుల్లో కుక్కలకు ఆహారం పెడుతున్నట్లు తెలిస్తే సంబంధిత చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని కోర్టు హెచ్చరించింది.

షెల్టర్ల నిర్మాణం : ఆగస్టు 11న ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఢిల్లీలో కొత్త డాగ్ షెల్టర్లు, పౌండ్లను ఏర్పాటు చేయాలని కోర్టు మున్సిపల్ సంస్థలను ఆదేశించింది.

కేసు విచారణ : ఈ కేసుకు సంబంధించి  ఆఖరి విచారణ  ఎనిమిది వారాల తర్వాత ఉంటుందని సుప్రీంకోర్టు తెలిపింది.