స్కూల్స్, హాస్పిటల్స్, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లలో వీధి కుక్కలను తొలగించాలి: సుప్రీంకోర్టు ఆర్డర్..

స్కూల్స్, హాస్పిటల్స్, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లలో వీధి కుక్కలను తొలగించాలి:  సుప్రీంకోర్టు ఆర్డర్..

స్కూల్స్, హాస్పిటల్స్, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లలో వీధి కుక్కలను పూర్తిగా  తొలగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. స్టెరిలైజేషన్ తర్వాత కుక్కలను తిరిగి అదే ప్రదేశంలో  వోదాలొద్దని కూడా  కోర్టు స్పష్టం చేసింది. జాతీయ రహదారుల అథారిటీ & పౌర సంస్థలతో పాటు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ ఆదేశం జారీ అయ్యింది. అలాగే జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, ఇతర రహదారుల పై ఉండే వీధి పశువులను తొలగించాలని సూచించింది. 

రోడ్లపై ఉండే ఇలాంటి పశువులను పట్టుకుని, వాటిని షెల్టర్ హోమ్‌లకు తరలించేలా చూసేందుకు ప్రత్యేక హైవే పెట్రోలింగ్ టీం  ఏర్పాటు చేయాలని కూడా ధర్మాసనం రాష్ట్రాలు & కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. దేశవ్యాప్తంగా కుక్క కాటు కేసుల విచారణలో భాగంగా ఈ ఆదేశాలు జారీ అయ్యాయి.  వీధి కుక్కలను తీసుకెళ్లే బాధ్యత సంబంధిత స్థానిక అధికార సంస్థలపై ఉంటుందని న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, సందీప్ మెహతా, ఎన్వి అంజరియాలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. 

జంతు జనన నియంత్రణ నిబంధనల ప్రకారం స్టెరిలైజేషన్, టీకాలు వేసిన తర్వాత కుక్కలకి ఏర్పాటు చేసిన  షెల్టార్లకు  మార్చాల్సి ఉంటుంది. ఈ కుక్కలను తిరిగి అదే ప్రదేశంలో వదిలేయడం వల్ల విధి కుక్కల నివారణ ఉద్దేశ్యాన్ని దెబ్బతీస్తుందని కోర్టు పేర్కొంది.  

రెండు వారాల్లోగా ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, ప్రజా రవాణా కేంద్రాలు, క్రీడా సౌకర్యాలను గుర్తించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోర్ట్  ఆదేశించింది. ఎనిమిది వారాల్లోగా ఈ ప్రదేశాల సరిహద్దులపై గోడల నిర్మించాలని, తద్వారా వీధి కుక్కలు ఈ ప్రదేశంలోకి  రాలేవని కూడా ఆదేశించింది. గుర్తించిన ప్రతి ప్రదేశానికి సాధారణ నిఘా, నిర్వహణ కోసం ఒక నోడల్ అధికారిని నియమిస్తారు. మున్సిపల్ సంస్థలు, పంచాయతీలు కనీసం మూడు నెలలకి ఒకసారి తనిఖీలు నిర్వహించి రిపోర్ట్ కోర్టుకు సమర్పించాలి.

జంతు జనన నియంత్రణ నియమాల అమలు సరిగా లేకపోవడంపై కోర్టు ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. నవంబర్ 3న ప్రభుత్వ ఆఫీసుల లోపల ఉద్యోగులు వీధి కుక్కలకు తిండి పెడుతున్నట్లు కోర్టు గుర్తించింది. కుక్కలకు ఆహారం పెట్టే ప్రాంతాలను జనాలు తిరిగే చోట్ల నుండి దూరంగా ఉంచాలని గతంలో ఆదేశాలు ఉన్న, ఈ సంఘటనలు జరిగాయి. ప్రభుత్వ ఆఫీసులలో, ప్రభుత్వ సంస్థలలో పనిచేసే ఉద్యోగులు వీధి కుక్కలకు ఆహారం పెడుతూ, వాటిని పెంచే, ప్రోత్సహించే వారికి సంబంధించి మేము ఆదేశాలు ఇస్తాము  అని కోర్టు  విచారణలో చెప్పింది.