
- హైకోర్టుల నుంచి నివేదిక కోరిన కోర్టు
న్యూఢిల్లీ, వెలుగు: తీర్పుల పెండింగ్‌కు సంబంధించి నెలల తరబడి జాప్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పెండింగ్‌లో ఉన్న తీర్పులపై నాలుగు వారాల్లోగా నివేదికను సమర్పించాలని దేశంలోని అన్ని హైకోర్టులను ఆదేశించింది. సోమవారం జార్ఖండ్‌కు చెందిన నలుగురు జీవిత ఖైదీల పిటిషన్‌ను విచారించిన సమయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
67 క్రిమినల్ కేసుల్లో తీర్పును రిజర్వ్ చేసిన తర్వాత.. వెలువరించకపోవడంతో జార్ఖండ్ హైకోర్టుపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. 2022లో జార్ఖండ్ హైకోర్టు తమ క్రిమినల్ అప్పీళ్లపై తీర్పు రిజర్వ్ చేసి, ఇంతవరకు ప్రకటించలేదని నలుగురు జీవిత ఖైదీలు ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీన్ని విచారించిన ధర్మాసనం 2025 జనవరి 31 లేదా అంతకుముందు వరకు తీర్పు రిజర్వ్ అయినప్పటికీ ప్రకటించని క్రిమినల్ కేసుల వివరాలను సమర్పించాలని హైకోర్టులను సుప్రీంకోర్టు ఆదేశించింది.