- ఎస్సీ కమిషన్ ను ఆశ్రయించినఎస్యూ ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత
కరీంనగర్ సిటీ, వెలుగు: శాతవాహన యూనివర్సిటీలో ప్రశ్నించే వారిని అర్బన్ నక్సలైట్లు అంటూ దుష్ప్రచారం చేస్తూ వేధిస్తున్నారని పెంచాల శ్రీనివాస్ పై, అతడిని ప్రోత్సహిస్తూ విద్యార్థులతోని, బయట వ్యక్తులతోనూ తనపై నిందలు వేస్తున్న వైస్ చాన్స్‌లర్ ఉమేశ్‌కుమార్ పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మెంబర్ జిల్లా శంకర్ కు ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత గురువారం ఫిర్యాదు చేశారు.
యూనివర్సిటీలో ప్రధానంగా దళిత విద్యార్థులు, ప్రొఫెసర్లను, ప్రశ్నించేవారిని లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారని అన్నారు. పెంచాల శ్రీనివాస్ పలుకేసుల్లో నిందితుడని, పలుమార్లు జైలు శిక్ష అనుభవించిన నేర చరిత్ర ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
