ప్రయోగాత్మక చిత్రాల్లో నటిస్తూ, తమిళంతో పాటు తెలుగులోనూ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నాడు సూర్య. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. లీడ్‌గా చేస్తూనే, ఇతర స్టార్ హీరోల చిత్రాల్లోనూ తనదైన యాక్టింగ్‌తో మెస్మరైజ్ చేస్తున్న సూర్య.. ఇటీవల కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ‘విక్రమ్’ చిత్రంలో రోలెక్స్ పాత్రలో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. నెగెటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్‌లో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.
డ్రగ్ మాఫియాను శాసించే రోలెక్స్ పాత్ర ఆయన అభిమానులను బాగా ఇంప్రెస్ చేయడంతో ఈ పాత్ర ఆధారంగా లోకేష్, సూర్య కాంబినేషన్‌లో సినిమా రానుందని గతంలో ప్రచారం జరిగింది. దీనిపై తాజాగా సూర్య క్లారిటీ ఇచ్చాడు. రోలెక్స్‌పై లోకేష్ చెప్పిన కథ త్వరలోనే మొదలవుతుందని చెప్పాడు. రీసెంట్‌గా ఫ్యాన్స్ మీట్‌లో పాల్గొన్న సూర్య తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి తెలియజేశాడు. ‘ప్రస్తుతం ‘కంగువా’ షూటింగ్‌లో బిజీగా ఉన్నా. మేము అనుకున్నదానికంటే వందరెట్లు అద్భుతంగా వస్తుంది.
ఈ ఏడాది అక్టోబర్ నుంచి నా 43వ సినిమా మొదలు పెట్టాలనుకుంటున్నా. త్వరలోనే పూర్తి వివరాలు తెలియజేస్తా. అలాగే వెట్రిమారన్ దర్శకత్వంలో ‘వాడి వాసల్’ కూడా స్టార్ట్ చేస్తా. లోకేష్ చెప్పిన రోలెక్స్ కథతోనూ సినిమా ఉంటుంది. వీటి తర్వాత ‘ఇరుంభుకై మాయావి’ చేస్తా’ అని చెప్పాడు. రోలెక్స్ గురించి సూర్య క్లారిటీ ఇవ్వడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.