జీడిమెట్లలో పేకాటడుతున్న 12 మంది అరెస్టు

జీడిమెట్లలో పేకాటడుతున్న 12 మంది అరెస్టు

జీడిమెట్ల, వెలుగు :  ఓ ఇంట్లో పేకాటాడుతున్న 12 మందిని బాలానగర్​ ఎస్వోటీ పోలీసులు అరెస్ట్​ చేశారు.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలానగర్​ పోలీస్​స్టేషన్​పరిధి పద్మానగర్​ఫేజ్​-1లో చింతల్​ కల్పనా సొసైటీకి చెందిన కె. మల్లికార్జున్​ పేకాట శిబిరాన్ని నడుపుతున్నారు.  బుధవారం ఇంట్లో  పేకాట ఆడుతున్న అల్వాల్​కి చెందిన ఎన్​. శ్రవణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పి. శ్రీకృష్ణ, బి. శివకుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

సూరారానికి చెందిన కె. రాఘవరెడ్డి, ఎస్. కె. మహ్మద్, ఎం. రమణ, ఏ. ఎస్. రావునగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి చెందిన పి. మోహన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సురేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, చింతల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన జంగెల్ల  ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్, మాదాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి చెందిన పి. విక్కీ కుమార్, దూపల్లికి చెందిన జి. చెంగారావులను అరెస్ట్​చేశారు. వారి నుంచి  రూ.1.76 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.