
ఏపీ మంత్రి రోజా ఇంటి ముందు ఉద్రిక్తత నెలకొంది. తెలుగు మహిళ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆధ్వర్యంలో మహిళా నేతలు, కార్యకర్తలు చీర, గాజులుతో రోజా ఇంటి ముట్టడికి ప్రయత్నించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న నగరి పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించినా మహిళా నేతలు రోజా ఇంటిలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులకు, నేతలకు మధ్య కాసేపు తోపులాట జరిగింది. మహిళా నేతలను,కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
రెండు మూడు రోజులుగా ఏపీ మంత్రి రోజా, నారా లోకేష్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. జబర్దస్త్ ఆంటీ, డైమండ్ పాప అంటూ రోజాపై నారా లోకేష్ విమర్శలు చేశారు. దీనికి కౌంటర్గా నారా లోకేష్ అంకుల్ అని , రాజకీయాలకు పనికిరాడని రోజా విమర్శించారు. లోకేష్ ఐరన్ లెగ్ అని..ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పటి నుంచే చంద్రబాబు పతనం మొదలైందని విమర్శించారు.