రానున్నది నిశ్శబ్ద విప్లవం..మా స్ట్రాటజీ మాకు ఉంది

రానున్నది నిశ్శబ్ద విప్లవం..మా స్ట్రాటజీ మాకు ఉంది
  • రెండో స్థానం కోసం బీఆర్ఎస్ , కాంగ్రెస్ పోటీ పడాలి
  • మా స్ట్రాటజీ మాకు ఉంది
  • నామినేషన్ల చివరి రోజు దాకా అభ్యర్థులను ప్రకటిస్తం
  • బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి

హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో నిశ్శబ్ద విప్లవం రాబోతోందని బీజేసీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. ఇవాళ నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని, రెండో స్థానం కోసం ఆ రెండు పార్టీలూ పోటీ పడాలని అన్నారు. అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి తమ స్ట్రాటజీ తమక ఉందన్నారు.

ALSO READ : పార్టీలకు హెచ్చరిక... ఉ: 10 నుంచి సా: 6 వరకే ప్రచారం.. నిబంధనలు అతిక్రమిస్తే.

నామినేషన్ల ఘట్టం చివరి రోజు వరకు అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు. ప్రచారం కోసం కమిటీలు వేసుకున్నామని, ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత తొలిసారి అమిత్ షా ఆదిలాబాద్ పర్యటనకు వస్తున్నారని అన్నారు. రేపు సాయంత్రం హైదరాబాద్లోని సికింద్రాబాద్ ఇంపీరియల్ గార్డెన్ లో మేధావుల తో అమిత్ షా సమావేశం అవుతారని చెప్పారు.