పార్టీలకు హెచ్చరిక... ఉ: 10 నుంచి సా: 6 వరకే ప్రచారం.. నిబంధనలు అతిక్రమిస్తే.

పార్టీలకు హెచ్చరిక... ఉ: 10 నుంచి సా: 6 వరకే ప్రచారం.. నిబంధనలు అతిక్రమిస్తే.

తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాష్ట్రంలోని పార్టీలు, పోటీ చేసే అభ్యర్థులకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ కీలక సూచనలు చేశారు. నియోజకవర్గాల్లో  ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు ప్రచారం చేసుకోవాలని సూచించారు. 24గంటల పాటు ఫిర్యాదులు చేసుకోవచ్చని తెలిపారు.

తెలంగాణలో పొలిటికల్ పార్టీలు ప్రచార ప్రకటనల కోసం మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ (MCMC) అనుమతి తీసుకోవాలని ఆదేశించారు. సింబల్ పక్కన ఈసారి అభ్యర్థి ఫోటో కూడా EVM లో ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ అధికారిక వెబ్సైట్స్ నుంచి మంత్రుల ఫోటోలు తొలగించాలన్నారు. 

ALSO READ : రౌడీలు, గుండాలపై ప్రివెంటివ్ యాక్షన్ తీసుకుంటాం : సీవీ ఆనంద్

ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులు..తమపై ఉన్న  కేసుల వివరాలను మీడియా, - పత్రికలకు ఇవ్వాలన్నారు వికాస్ రాజ్. ఎక్కువ మొత్తంలో డబ్బులు క్యారీ చేస్తే డాకుమెంట్స్ చూపించాలని సూచించారు. అలాగే రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న పథకాలపై గతంలోని నిబంధలే వర్తిస్తాయన్నారు. లిక్కర్ అమ్మకంపై ఇప్పటికే నిఘా పెట్టామని.. నిబంధనలు పాటించకుంటే సిజ్ చేస్తారని హెచ్చరించారు.