
తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కావడంతో పోలీస్ శాఖ మరింత అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా మద్యం, డబ్బులు పంపిణీ, రవాణా పై ప్రత్యేక దృష్టి పెట్టామని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. డ్రగ్స్ పై మరింత ఫోకస్ పెట్టామని చెప్పారు. రౌడీలు, గుండాలపై ప్రివెంటివ్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు. 24 గంటల పాటు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మూడు టీమ్స్ పని చేస్తాయని ఆయన తెలిపారు. అన్ని శాఖలతో సమన్వయం చేసుకొని ముందుకు పోతామన్నారు. ఆన్లైన్ డబ్బులు పంపిణీ,ట్రాన్స్ఫర్ పై ప్రత్యేక నిఘా పెట్టామన్న సీవీ ఆనంద్.. బ్యాంక్ సహాయం తీసుకొని డిజిటల్ పేమెంట్స్ పై ఫోకస్ చేయబోతున్నామని తెలిపారు. 15 నియోజకవర్గాలలో 15 మంది నోడల్ ఆఫీసర్ల ను పెట్టామన్నారు.