అమల్లోకి ఎన్నికల కోడ్..ఫ్లెక్సీలు, బ్యానర్ల తొలగింపు

అమల్లోకి ఎన్నికల కోడ్..ఫ్లెక్సీలు, బ్యానర్ల తొలగింపు

తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల కోడ్ ప్రకారం..ఎక్కడా కూడా ప్లెక్సీలు, బ్యానర్లు ఉండకూడదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు, పట్టణాలు, కార్పొరేషన్లలో అధికార బీఆర్ఎస్ పార్టీతో పాటు..ఇతర పార్టీల ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగిస్తున్నారు. 

ఎలక్షన్ కోడ్ అమల్లోకి రావడంతో రంగారెడ్డి జిల్లా బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఫ్లెక్సీలను  మున్సిపాల్ సిబ్బంది తొలగించారు. అటు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని మంత్రి సబితా ఇంద్రారెడ్డి భారీ కటౌట్ ను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. 

ALSO READ : Cricket World Cup 2023: కోహ్లీ నన్ను టెస్టు మ్యాచ్ ఆడమన్నాడు: రాహుల్

జగిత్యాల జిల్లా వెలగటూరు మండలంలోని పలు గ్రామాల్లో అధికార బీఆర్ఎస్ తో పాటు..ఇతర పార్టీల నాయకుల ఫ్లెక్సీలు, బ్యానర్లను గ్రామ పంచాయితీ సిబ్బంది నిర్దాక్షిణ్యంగా తొలగించారు. గోడలపై రాసిన రాతలను గ్రామ పంచాయితీ సిబ్బంది  చెరిపివేశారు.