యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలికిన కేసీఆర్

యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలికిన కేసీఆర్

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. యశ్వంత్ సిన్హా కు సీఎం కేసీఆర్ తో పాటు రాష్ట్ర మంత్రులు గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పారు. ఈ సందర్భంగా బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి ఖైరతాబాద్ మీదుగా జలవిహార్ వరకు 10 వేల మందితో బైక్ ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమైంది టీఆర్ఎస్.  సిన్హాకు మద్దతిస్తూ జలవిహార్ లో ఏర్పాటు చేసే సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడనున్నారు. 

యశ్వంత్ సిన్హా ట్రావెల్ చేసే రూట్లలో మధ్యాహ్నం రెండింటి దాకా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. బేగంపేట్, సోమాజిగూడ, ఖైరతాబాద్, ఐమాక్స్, రోటరీ, నెక్లెస్ రోడ్స్, జలవిహార్ ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్షన్స్ చేస్తారు. నిర్ధేశించిన రూట్లలో ట్రావెల్ చేసేలా సైన్ బోర్డ్స్ పెట్టారు. గ్రీన్ ల్యాండ్స్ నుంచి రాజ్ భవన్ రోడ్ లో ట్రాఫిక్ డైవర్ట్ చేస్తున్నారు పోలీసులు. ఖైరతాబాద్ నుంచి నెక్లెస్ రోడ్ వైపు ట్రాఫిక్ అనుమతి లేదు. మినిస్టర్స్ రోడ్ నుంచి సంజీవయ్య పార్క్ రూట్ లో ట్రాఫిక్ ను అనుమతించరు. 

ట్యాంక్ బండ్ నుంచి సంజీవయ్య పార్క్ వైపు వచ్చే ట్రాఫిక్.. సోనాభాయ్ మసీద్, కర్బలా మైదాన్ మీదుగా వెళ్లాలి. అలాగే మింట్ కంపౌండ్ నుంచి నెక్లెస్ రోడ్ రూట్ లో ట్రావెల్ చేసే వాహనాలు.. ఖైరతాబాద్ బడా గణేష్ రూట్ లో ప్రయాణించాలని సిటీ పోలీసులు ప్రకటించారు.