స్కాలర్ షిప్ రిజిస్ట్రేషన్ కోసం ఈ పాస్ వెబ్ సైట్ షురూ

స్కాలర్ షిప్ రిజిస్ట్రేషన్ కోసం ఈ పాస్ వెబ్ సైట్ షురూ
  • సెప్టెంబర్ 30 వరకు అప్లైకి గడువు

హైదరాబాద్, వెలుగు: రాష్ర్ట ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ,ఈబీసీ, మైనారిటీ, దివ్యాంగుల స్టూడెంట్లకు ఇచ్చే పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ ల కోసం ఈ పాస్ వెబ్ సైట్ ను స్టార్ట్ చేసినట్టు ఎస్సీ సంక్షేమ శాఖ ఇన్ చార్జ్ సెక్రటరీ శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు. 2025–26 అకడమిక్ ఇయర్​కు పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల మంజూరు,  పంపిణీలో పారదర్శకత, జవాబుదారీతనం కోసం ఆన్‌లైన్ http://telanganaepass.cgg.gov.in (ఈ పాస్ పోర్టల్ ) అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు.

 పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ కింద ఫ్రెష్ , రెన్యువల్ స్కాలర్‌షిప్‌ల మంజూరు కోసం అప్లై చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ పాస్‌లో నమోదు చేసుకోవాలనుకునే అన్ని కాలేజీలు, విద్యార్థులు ఈ నెల 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు అప్లై చేసుకోవాలని సెక్రటరీ వెల్లడించారు.