రావిర్యాలలో గజం 83 వేల 500 రూపాయలు !

రావిర్యాలలో గజం 83 వేల 500 రూపాయలు !

అటు క్యూర్ పరిధిలో హౌసింగ్ బోర్డ్ స్థలాలకు భారీ రేట్లు పలికాయి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం, ఫ్యూచర్ సిటీ ఎంట్రన్స్లోని రావిర్యాలలో ఉన్న హౌసింగ్ బోర్డు భూములకు గురువారం ఈ-వేలం నిర్వహించారు.

మొత్తం నాలుగు ప్లాట్లకు నిర్వహించిన వేలం పాటలో చదరపు గజం రికార్డ్ స్థాయిలో రూ.83 వేల 500కు అమ్ముడు పోయిందని హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్  వి.పి.గౌతం పత్రిక ప్రకటనలో తెలిపారు. వెయ్యి నుంచి 13,500 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న నాలుగు ప్లాట్లకు నిర్వహించిన వేలం పాట ద్వారా సుమారు రూ. 140 కోట్ల ఆదాయం వచ్చిందని ఆయన తెలిపారు.

ఈ భూముల వేలానికి గత నెలలో హోసింగ్ బోర్డు నోటిఫికేషన్ ఇచ్చింది. సుమారు 17 సంస్థలు పోటీ పడ్డాయి. ఇందులో 1113 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న భూమిని చదరపు గజం రూ.83,500 కు ఒక డెవలపర్  సంస్థ దక్కించుకుంది. ఇదే ప్రాంతంలోని సుమారు 6 వేల చదరపు గజాల విస్తీర్ణంలోని భూమి చదరపు గజం రూ.62,500 రేటుకు అమ్ముడు పోయింది.

KPHB కాలనీ, కుత్బుల్లాపూర్ చింతల్ ప్రాంతాల్లోని మరో నాలుగు ల్యాండ్​పార్శిల్స్​కు  శుక్రవారం  ఈ యాక్షన్​ నిర్వహించనున్నారు. కేపీహెచ్​బీ కాలనీ ఫేజ్ 1-2 లోని 5,898 చదరపు గజాలు, 2,420 చదరపు గజాల్లోని ప్లాట్ నెం 2, కుత్బుల్లాపూర్ చింతల్ లోని 10,890 చదరపు గజాలు, 3,388 చదరపు గజాల భూములను వేలం ద్వారా విక్రయించనున్నారు.