హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమిట్‌లో భాగంగా ఏర్పాటు చేసిన ఎక్స్‌పోలో నెట్ జీరో స్టాల్‌కు స్వదేశీ, విదేశీ సందర్శకుల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తోంది. ఈ స్టాల్ లో ఎలక్ట్రిక్ వెహికల్స్, వేస్ట్ టు ఎనర్జీ, విండ్ పవర్, పంప్డ్ స్టోరేజ్ పవర్ జనరేషన్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (బీఈఎస్ఎస్), సోలార్ ప్యానల్స్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ల నమూనాలను ఏర్పాటు చేశారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, విదేశీ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు ఈ స్టాల్‌ను సందర్శించి పరిశీలించారు.
పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్ పనితీరును రియల్ టైమ్‌లో ప్రదర్శించడం సందర్శకులను బాగా ఆకట్టుకుంటున్నది. పర్యావరణం, గ్రీన్ ఎనర్జీపై అవగాహన కల్పించేందుకు రూపొందించిన నెట్ జీరో క్విజ్ సాఫ్ట్ వేర్‌లో పాల్గొన్న సందర్శకులు సర్టిఫికెట్లు కూడా సాధించారు. టీజీఎస్‌పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ (ఐఏఎస్), డైరెక్టర్లు డా.నరసింహులు, శివాజీ తదితర అధికారులు సందర్శకులకు నమూనాల గురించి వివరంగా తెలియజేశారు.
