పనికి తగిన వేతనం ఇవ్వాలి..తెలంగాణ కార్మిక సమైక్య డిమాండ్

పనికి తగిన వేతనం ఇవ్వాలి..తెలంగాణ కార్మిక సమైక్య డిమాండ్

ముషీరాబాద్, వెలుగు: ప్రైవేట్ కంపెనీలో పని చేసే కార్మికులకు పనికి తగిన వేతనం ఇవ్వాలని తెలంగాణ కార్మిక సమైక్య డిమాండ్ చేసింది. మంగళవారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమైక్య ఆధ్వర్యంలో వశపాక నరసింహ అధ్యక్షతన ‘అన్ని రంగాల కార్మికుల హక్కుల కోసం పోరాడుదాం’ అనే అంశంపై సమావేశం జరిగింది.

దీనికి సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడు  కాలకోటి రామన్న, కోలా జనార్దన్ హాజరై మాట్లాడారు. జీహెచ్ఎంసీ మున్సిపల్​కార్మికులు, జీపీల్లో కాంట్రాక్ట్ వర్కర్లు, పారిశుధ్య కార్మికులను పర్మినెంట్ చేయాలన్నారు. అంతవరకు 30 వేల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అన్ని రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు గుర్తింపు కార్డులు ఇచ్చి, వారి పిల్లలకు కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య, వైద్యం అందించాలని కోరారు.

55 ఏండ్లు నిండిన కార్మికులందరికీ కార్మిక శాఖ ద్వారా రూ.5 వేల పెన్షన్ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు.