అభిషేక్ మను సింఘ్వీ నివాసానికి సీఎం రేవంత్

అభిషేక్ మను సింఘ్వీ నివాసానికి సీఎం రేవంత్

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ సీఎం  రేవంత్ రెడ్డి తన ఢిల్లీ పర్యటనలో భాగంగా రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నికైన కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీని మర్యాదపూర్వకంగా కలిశారు. రాజ్యసభ సభ్యుడిగా సింఘ్వీ మరోసారి ఎన్నికైన సందర్భంగా ఢిల్లీ లోని లోధి రోడ్డులో తన నివాసంలో ఏర్పాటు చేసిన తేనీటి విందుకు సీఎం హాజరయ్యారు. 

ఈ సందర్భంగా సింఘ్వీ కి సీఎం రేవంత్ రెడ్డి  పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ విందు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్‌‌‌‌ కుమార్‌‌ రెడ్డి, సురేశ్‌‌ శెట్కార్, రఘువీర్‌‌ రెడ్డి, అనిల్‌‌ కుమార్‌‌ యాదవ్, కాంగ్రెస్‌‌ నేత రోహిన్‌‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.