అమెరికాతో చర్చలకు మొజ్తబా అంగీకారం..!

అమెరికాతో చర్చలకు మొజ్తబా అంగీకారం..!

టెహ్రాన్: అమెరికాతో చర్చలు జరిపి యుద్ధాన్ని ముగించే దిశగా ఒప్పందం చేసుకోవడానికి ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ అంగీకరించినట్లు అంతర్జాతీయ మీడియా నివేదికలు మంగళవారం వెల్లడించాయి. వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య కొద్దిరోజులుగా చర్చలు జరుగుతున్నాయని, కొన్ని ప్రధాన అంశాల పై ఏకాభిప్రాయం కూడా కుదిరిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇప్పటికే ధ్రువీకరించారు. 

ఒప్పంద ప్రక్రియలో తన దౌత్య ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ చురుగ్గా పాల్గొంటున్నారని తెలిపారు. ప్రస్తుతం ఈ చర్చలను ఇరాన్ కూడా సీరియస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తీసుకుంటోందని, మరో ఐదు రోజుల్లోగా సానుకూల ఒప్పందం వెలువడే అవకాశం ఉందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు, ఇరాన్ అధికారిక వార్తా సంస్థ 'ఫార్స్' మాత్రం అమెరికాతో ఎటువంటి చర్చలు జరగట్లేదని పేర్కొనడం గమనార్హం.