విద్యా కమిషన్ సిఫార్సులు సవరించాలి...ఎస్ఎఫ్ఐ సదస్సులో వక్తలు

విద్యా కమిషన్ సిఫార్సులు సవరించాలి...ఎస్ఎఫ్ఐ సదస్సులో వక్తలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర విద్యా వ్యవస్థ బలోపేతానికి తెలంగాణ విద్యా కమిషన్ సిఫార్సులను సవరించి సమగ్రంగా రూపొందించాలని వక్తలు డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్‌‌లో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.రజనీకాంత్ అధ్యక్షతన రాష్ట్ర విద్యా సదస్సు జరిగింది. మాజీ ఎమ్మెల్సీ ఎ.నర్సిరెడ్డి, విద్యావేత్త ఆర్.వెంకట్ రెడ్డి, ఓయూ ప్రొఫెసర్ ఆమంచి నాగేశ్వరరావు తదితరులు పాల్గొని మాట్లాడారు.