- ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ సంగీత సత్యనారాయణ
- గాంధీ దవాఖానలో ప్రపంచ టీబీ దినోత్సవం
పద్మారావునగర్, వెలుగు: ప్రపంచ టీబీ దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ గాంధీ మెడికల్కాలేజీలోని అలుమ్ని ఆడిటోరియంలో మంగళవారం ‘100 రోజుల టీబీ ముక్త్ భారత్ అభియాన్' కార్యక్రమాన్ని ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. తొలి విడతలో17.09 లక్షల మందికి టీబీ నిర్ధారణ పరీక్షలు నిర్వహించామని, నిక్షయ్ పోషణ్ యోజన ద్వారా కోట్లాది మందికి పోషకాహారం అందించామన్నారు. టీబీ లక్షణాలున్న వారికి ఉచిత పరీక్షలు, మందులు అందిస్తున్నామన్నారు.
ఈ సందర్భంగా టీబీ నిర్మూలనలో మెరుగైన పనితీరు కనబరిచిన జిల్లాల అధికారులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. ప్రచార పోస్టర్లను విడుదల చేయడంతో పాటు, టీబీ బాధితులకు పోషకాహారం పంపిణీ చేశారు. ‘100 రోజుల టీబీ ముక్త్ భారత్ అభియాన్' ప్రచార యాత్రను జెండా ఊపి ప్రారంభించారు.
కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ రీజనల్ డైరెక్టర్ డా. ఎం. అనురాధ, ప్రజా ఆరోగ్యం కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డా. రవీందర్ నాయక్, తెలంగాణ టీబీ అసోసియేషన్ వైస్ చైర్మన్ డా. సుధీర్ ప్రసాద్, ఎస్‌టిడీసీ డా. రాజేశ్వరి, డబ్ల్యూహెచ్‌ఓ టీబీ కన్సల్టెంట్ డా. మహేష్, డా. బ్లెస్సీ, జేడీ టీబీ ఆఫీస్ హెల్త్ ఎక్స్టెన్షన్ఆఫీసర్మొగరాల శ్రీనివాస్ పాల్గొన్నారు.
