మూడు కొత్త చట్టాలపై న్యాయవాదులకు రెండు రోజులు ట్రైనింగ్

మూడు కొత్త చట్టాలపై న్యాయవాదులకు రెండు రోజులు ట్రైనింగ్

న్యాయవ్యవస్థలో జులై 1నుంచి సమూల మార్పులు జరుగనున్నాయి. బ్రిటిష్  కాలం నాటి చట్టాలను మారుస్తూ  బాధితులకు న్యాయం జరిగేలా సమకాలీన, సాంకేతికతకు అనుగుణంగా తీసుకొచ్చిన భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియం క్రిమినల్‌‌‌‌‌‌‌‌ చట్టాలు అమలులోకి రానున్నాయి.

 ఈ క్రమంలో  తెలంగాణ పోలీస్ అకాడమీలో  తెలంగాణ స్టేట్ జ్యుడీషియల్ అకాడమీ  మూడు కొత్త చట్టాలపై  న్యాయవాదులకు  రెండు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి  జస్టిస్ పి సామ్ కోశి సమక్షంలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్ పాల్ సెషన్‌ను ప్రారంభించారు. ప్రారంభ సెషన్‌లో తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్‌పర్సన్  ఎ.నరసింహారెడ్డి, తెలంగాణ స్టేట్ జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్ డాక్టర్ ఎం. రాజేందర్ కూడా పాల్గొన్నారు.
 
ఈ సందర్భంగా మాట్లాడిన జస్టిస్ సుజోయ్ పాల్.. న్యాయవాది సంఘానికి, ముఖ్యంగా యువ న్యాయవాదులకు చట్ట నిబంధనలను చదవడం అలవాటు చేసుకోవాలని  విజ్ఞప్తి చేశారు.  ఇటువంటి శిక్షణా సమావేశాన్ని నిర్వహించేందుకు  ప్రయత్నం చేసిన అకాడమీ , బార్ కౌన్సిల్ ను  ఆయన ప్రశంసించారు. 
 
 న్యాయవాది సంఘంపై ప్రత్యేకించి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలని న్యాయవాది సామ్ కోశి అన్నారు. ఎందుకంటే  పాత మరియు కొత్త క్రిమినల్ చట్టాల  నిబంధనలతో వ్యవహరించాల్సి ఉంటుందని సూచించారు.  కొత్త చట్టాలలో చేసిన  మార్పులను ..  న్యాయవాదులు ఎప్పటికప్పుడు కొత్త చట్టాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నరసింహారెడ్డి. 
 
 న్యాయవ్యవస్థ, పోలీసు, ప్రాసిక్యూషన్‌తో పాటు స్వతహాగా టార్చ్ బేరర్లుగా ఉన్న అడ్వకేట్ కమ్యూనిటీకి అవసరమైన జ్ఞానాన్ని అందించడానికి శిక్షణా కార్యక్రమాన్ని నిశితంగా రూపొందించినట్లు తెలిపారు తెలంగాణ రాష్ట్ర జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్ ఎం. రాజేందర్.  పౌర సమాజాన్ని సరైన దిశలో నడిపించడం. తెలంగాణ రాష్ట్ర జ్యుడీషియల్ అకాడమీ అడ్వకేట్ కమ్యూనిటీకి శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించడం ఇదే తొలిసారన్నారు.  ఇలాంటి శిక్షణా సెషన్లు  ఇంకా చాలా జరుగుతాయని చెప్పారు.