హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్మల్కాజిగిరి, వికారాబాద్జిల్లాల్లోని కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణల కార్యక్రమం మంగళవారం ఘనంగా జరిగింది. హైదరాబాద్ కలెక్టరేట్ లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని అడిషనల్కలెక్టర్ కదిరవన్ పలని ఆవిష్కరించారు. ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేశ్ , జిల్లా సర్వే ఆఫీసర్శ్రీరామ్, కలెక్టరేట్ ఇన్చార్జి ఏఓ విజయలక్ష్మి పాల్గొన్నారు.
వికారాబాద్లో కలెక్టరేట్లో కలెక్టర్ ప్రతీక్జైన్ఆవిష్కరించగా ఎస్పీ స్నేహ మెహ్రా, అడిషనల్ కలెక్టర్లు లింగ్యా నాయక్, సుధీర్ హాజరయ్యారు. రంగారెడ్డి కలెక్టరేట్లో కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆవిష్కరించగా వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. మేడ్చల్ -మల్కాజిగిరి కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టర్ రాధిక గుప్తా ఆవిష్కరించారు. – హైదరాబాద్ సిటీ/రంగారెడ్డి/మేడ్చల్/వికారాబాద్, వెలుగు

