అక్టోబర్ 5 నుంచి ఐసెట్ స్పెషల్ ఫేజ్ అడ్మిషన్లు

అక్టోబర్  5 నుంచి ఐసెట్ స్పెషల్ ఫేజ్ అడ్మిషన్లు

హైదరాబాద్, వెలుగు: వచ్చే నెల 5 నుంచి ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం టీజీఐసెట్ స్పెషల్ ఫేజ్ అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు. అక్టోబర్ 5న ఆన్ లైన్ రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ ప్రక్రియ.. అక్టోబర్ 6న సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఉంటుందని తెలిపారు.

 అక్టోబర్ 6,7 తేదీల్లో వెబ్ ఆప్షన్ల ప్రక్రియ నిర్వహిస్తామని.. 10న సీట్ల కేటాయింపు ఉంటుందని వెల్లడించారు. కాగా, ఇప్పటికే సీట్లు పొందిన అభ్యర్థులు ట్యూషన్ ఫీజు చెల్లించేందుకు ఈ నెల 24 వరకూ, కాలేజీల్లో రిపోర్టు చేయడానికి 25 వరకూ గడువు పెంచారు.