కరెంటు బిల్లులపై వినియోగదారుల సమాచారం

కరెంటు బిల్లులపై వినియోగదారుల సమాచారం
  • ముద్రించనున్న టీజీఎస్పీడీసీఎల్

హైదరాబాద్, వెలుగు: దక్షిణ తెలంగాణ విద్యుత్  పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) ఈ నెల నుంచి విద్యుత్  బిల్లులపై వినియోగదారుల మొబైల్  ఫోన్ నంబర్, ఈమెయిల్  ఐడీ వంటి వివరాలను ముద్రించనుంది. బిల్లులో ముద్రించిన మొబైల్  నంబర్  లేదా ఇతర వివరాల్లో ఏవైనా పొరపాట్లు ఉంటే, వినియోగదారులు సంస్థ అధికారిక వెబ్‌సైట్  లేదా మొబైల్ యాప్  ద్వారా వాటిని సరిచేసుకునే అవకాశం ఉంది.

వినియోగదారులకు ఏవైనా సమస్యలు ఎదురైతే నేరుగా సంబంధిత అధికారులను సంప్రదించేందుకు ఇప్పటికే  బిల్లులపై ఏఈ/అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్  మొబైల్ నంబర్లను కూడా ముద్రిస్తున్నారు.