మూడో దశ వచ్చే ప్రమాదం పొంచి ఉంది: కేంద్రం

మూడో దశ వచ్చే ప్రమాదం పొంచి ఉంది: కేంద్రం
  • మూడో దశ వచ్చే ప్రమాదం పొంచి ఉంది: కేంద్రం

న్యూఢిల్లీ: కరోనాపై రాష్ట్రాలను మరోసారి అప్రమత్తం చేసింది కేంద్రం. కరోనాకి సంబంధించి ఎన్ని దశలొచ్చినా, ఎప్పుడొచ్చినా సమర్థవంతంగా ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండాలని సూచించింది. రెండో దశలో డెల్టా వేరియంట్  విజృంభించినట్టే.. ఒమిక్రాన్  రూపంలో మూడో దశ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించింది. డెల్టా కంటే ఆరింతలు వేగంగా వ్యాపించే ఒమిక్రాన్  పై అప్రమత్తంగా ఉండాలంది. అన్ని జిల్లా కేంద్రాల్లో టెలీ వైద్య వ్యవస్థను విస్తరించాలని చెప్పింది.  జిల్లా స్థాయి హాస్పిటల్స్ లో కొత్తగా క్రిటికల్  కేర్  పడకలు ఏర్పాటు చేయాలని, ఇప్పటికే ఉన్న బెడ్స్ సంఖ్య పెంచాలని సూచించింది.