సౌదీలో జరిగిన బస్సు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. 2025 నవంబర్ 17 తెల్లవారు జామున జరిగిన ఈ ప్రమాంలో 42 మంది చనిపోయారు. అందులో 16 మంది హైదరాబాద్ లోని మల్లేపల్లి బజార్ ఘాట్ కు చెందిన వారు ఉన్నట్లు గుర్తించారు. దీంతో పాతబస్తీలో తీవ్ర విషాదం నెలకొంది.
మృతుల వివరాలు:
మృతుల్లో హైదరాబాద్ మల్లేపల్లి బజార్ ఘాట్‌కు చెందిన 16 మంది ఉన్నారు. వారి పేర్లు వరుసగా.. రహీమున్నీసా, రహమత్ బీ, షెహనాజ్ బేగం, గౌసియా బేగం, కదీర్ మహ్మద్, మహ్మద్ మౌలానా, షోయబ్ మహ్మద్, సోహైల్ మహ్మద్, మస్తాన్ మహ్మద్, పర్వీన్ బేగం, జకియా బేగం, షౌకత్ బేగం, ఫర్హీన్ బేగం, జహీన్ బేగం, మహ్మద్ మంజూరు, మహ్మద్ అలీగా గుర్తించారు.
సౌదీలో సోమవారం (నవంబర్ 17) తెల్లవారు జామున డీజిల్ ట్యాంకర్‌ను బస్సు ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 42 మంది మృతి చెందారు. భారతీయ యాత్రికులు మక్కా నుంచి మదీనాకు వెళ్తున్న క్రమంలో బదర్-మదీనా మధ్య ముఫరహత్ ప్రాంతంలో డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మృతుల్లో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నారు. ఎక్కువ మంది హైదరాబాద్ వాసులుగా గుర్తించారు.
