
అవసరం ఎవరినైనా, ఏ పనైనా చేసేందుకు ప్రోత్సహిస్తుంది. కాకపోతే దాన్ని ఎంచుకునే మార్గం మంచా, చెడా అన్నది చాలా ముఖ్యం. అవసరాలను తీర్చుకునేందుకు కొంత మంది ఇతరులపై ఆధారపడితే.. మరికొంత మంది మాత్రం తమ సృజనాత్మకతతో సమస్యకు పరిష్కార వెతుకుతారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఓ వీడియో కూడా దీనికి ఉదాహరణగా నిలుస్తోంది.
So true, necessity is the mother of invention! pic.twitter.com/KWHCNkWHre
— Vishweshwar Bhat (@VishweshwarBhat) July 6, 2023
ట్విట్టర్‌లో వైరల్ అవుతోన్న ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా అకట్టుకుంటోంది. ఈ క్లిప్ టూత్‌పేస్ట్ ట్యూబ్ కవర్‌ను తెరవడంతో ప్రారంభమవుతుంది. సాధారణంగా, ట్యూబ్ నుంచి టూత్ క్లెన్సింగ్ జెల్ వస్తుంది. కానీ ఈసారి అది నీటిని వెదజల్లుతోంది. కంటైనర్‌ను నీటితో నింపడానికి ఓ మహిళ... కుళాయికి టూత్ ట్యూబ్ ను అమర్చి, బకెట్‌లోకి వదిలింది. కెమెరా జూమ్ అవుట్ చేసినప్పుడు టూత్‌పేస్ట్ ట్యూబ్ నీటి పైపుకు అమర్చినట్టు స్పష్టమవుతుంది. చివర్లో కుళాయిని ఆపేసేందుకు ఆ మహిళ.. ట్యూబ్ కు క్యాప్ తో మూసివేసింది.
ALSO READ :ఈ తల్లి కష్టాలు.. పగోళ్లకు కూడా వద్దు.. ఓ చేతిలో బిడ్డ.. మరో చేతిలో స్టీరింగ్
ఈ వీడియో ఆన్‌లైన్‌లో షేర్ అయిన వెంటనే యూజర్స్ ను తెగ ఆకట్టుకుంది. చాలామంది భారతీయులు పుట్టుకతోనే మేధావులు అని ఒకరు రాయగా.. పైప్‌కు టూత్‌పేస్ట్ ట్యూబ్ ఊడిపోకుండా ఉండేందుకు దానికి ఏదైనా జిగురు లాంటి పదార్థం అంటించాలని మరో యూజర్ సూచించారు. అస్సాంలోని కొన్ని గ్రామాల్లో ఇది దశాబ్దాలుగా చాలా సాధారణమైన విషయంగా కొనసాగుతోందని ఇంకొకరు అన్నారు.