టీజేఏసీ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా హర్షవర్ధన్​ రెడ్డి

టీజేఏసీ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా హర్షవర్ధన్​ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: త్వరలో జరగనున్న  నల్గొండ–ఖమ్మం–వరంగల్‌‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి టీచర్స్ జాయింట్ యాక్ష న్ కమిటీ(టీజేఏసీ) అభ్యర్థిగా జి.హర్షవ ర్ధన్ రెడ్డి పేరును ఖరారు చేశారు. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్​లోని టీఎన్​జీవో భవన్ లో టీజేఏసీ అనుబంధ సంఘాల సమావేశం 
నిర్వహించారు.

ఈ సందర్భంగా టీజేఏసీ చైర్మ న్ మణిపాల్ రెడ్డి, సెక్రటరీ జనరల్ పర్వతి సత్యనారాయణ, ట్రెజరర్ జగదీశ్ మాట్లాడారు. గత కొన్నేండ్లుగా టీచర్ల సంక్షేమం కోసం కృషి చేస్తున్న హర్షవర్ధన్ రెడ్డిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా  నిల పాలని తీర్మానించినట్టు చెప్పారు. హర్షవర్ధన్ స్కూళ్లు, కాలేజీల్లో పనిచేసే టీచర్లు, లెక్చరర్ల సంక్షేమం కోసం కృషి చేశారని వెల్లడించారు.