రాష్ట్రంలో పలు చోట్ల దంచికొడుతున్న వానలు

రాష్ట్రంలో పలు చోట్ల దంచికొడుతున్న వానలు

రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ వర్షం దంచికొడుతోంది. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షం కురుస్తోంది. హైదరాబాద్ బండ్లగూడలోని కందికల్ లో 5.3 సెంటీమీటర్ల వర్షం నమోదు కాగా.. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో 3.2, అబ్దూల్లాపూర్ మెట్లో 2.6 సెంటిమీటర్ల వర్షం పడింది. ఇటు మహబూబాబాద్, నల్లగొండ, మెదక్, రాజన్నసిరిసిల్ల, మహబూబ్ నగర్, రంగారెడ్డి, సిద్దిపేట, నాగర్ కర్నూల్, కామారెడ్డి, ములుగు, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షం పడుతోంది.

ఇక హైదరాబాద్ లో చాలా ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, పంజాగుట్ట, ఎల్బీనగర్, సరూర్నగర్, వనస్థలిపురం, నాగోల్, హయత్నగర్, చార్మినార్, నాంపల్లి, రాజేంద్రనగర్, శంషాబాద్ ఏరియాల్లో వర్షం దంచికొడుతోంది. దీంతో చాలా చోట్ల ట్రాఫిక్ జాం అవుతోంది. వాహనాలను ట్రాఫిక్ పోలీసులు క్లీయర్ చేస్తున్నారు.

మరోవైపు శంషాబాద్ మున్సిపాలిటీ పరిధి సిద్ధాంతి గ్రామంలో ఈరోజు ఉదయం నుండి భారీ వాన కురుస్తున్నది. ఈ వర్షానికి గ్రామలంలోని లోతట్టు ప్రాంతాలు నీటమునిగి ఇళ్లలోకి నీరు చేరింది. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రతిసారి వర్షానికి తమ గ్రామం నీటమునిగిన ఇళ్లలోకి నీరు చేరుతున్నాయని.. అధికారులు ఇప్పటికైనా సమస్యను గుర్తించి నీరు నిలువకుండా చూడాలని అని కాలనీ వాసులు కోరుతున్నారు.